ఉత్కంఠకు తెర.. టీయూడ‌బ్ల్యూజే (ఐజేయు) నూతన కార్యవర్గం ఎంపిక

by Ratna Kumari |   (  Updated:2025-12-05 16:08:59  IST  )

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐజేయు) మహబూబ్ నగర్ జిల్లా కమిటీని ఆ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్, ఎన్నికల నిర్వహణ

ఉత్కంఠకు తెర.. టీయూడ‌బ్ల్యూజే (ఐజేయు) నూతన కార్యవర్గం ఎంపిక
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐజేయు) మహబూబ్ నగర్ జిల్లా కమిటీని ఆ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్, ఎన్నికల నిర్వహణ అధికారి మల్యాల బాలస్వామి, సహ ఎన్నికల అధికారి కొంతం ప్రకాష్ శుక్రవారం ప్రకటించారు. ఇటీవల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా మహాసభల సందర్భంగా నూతన కమిటీ ఎంపిక ప్రక్రియను నిర్వహించగా అధ్యక్ష పదవికి నాగరాజు గౌడ్ (దిశ), సతీష్ రెడ్డి (వార్త) పోటీ పడడంతో ఎన్నికల ప్రక్రియ కొంత వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర నాయకత్వం జోక్యం చేసుకొని కలిసికట్టుగా పని చేసే యూనియన్ ను బలోపేతం చేయాల‌ని విజ్ఞప్తి చేయడంతో, పోటీదారుల మధ్య సయోధ్య కుదిరింది. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో అధ్యక్షులు కాటం నాగరాజు (దిశ), ప్రధాన కార్యదర్శిగా సతీష్ రెడ్డి(వార్త)ను ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా కె.పవన్ కుమార్ రెడ్డి (టీజీ న్యూస్), మెరాజ్ (సిటి ఇండియా న్యూస్), ఐలమోని శేఖర్ (ప్రజా పక్షం), కరణం భాస్కర్ రావ్ (వేకువ సమయం)ఎంపికయ్యారు. కార్యదర్శులుగా. ఎం రవీందర్ గౌడ్ (సిటీ ఇండియా న్యూస్), ఎండి జాఫర్ (4 టివి), ప్రభాకర్ (మనతెలంగాణ), గోకులం వెంకటేష్ (టిఎస్ న్యూస్), కోశాధికారిగా జిల్లెల రఘు (విజయ క్రాంతి), గౌరవ సలహాదారుగా కె.విజయ రాజు, (వార్తా తరంగాలు) ఎన్నికైనట్లు ప్రకటించారు. కార్యవర్గ సభ్యులు గా దేవరకద్ర- ప్రశాంత్ (దిశ), సిసికుంట- వేణుగోపాలచారి (ఆంధ్రజ్యోతి), భూత్పూర్- గొడుగు వెంకటయ్య (వార్త), గండీడ్ - వీరాజీ (దిశ), నవాబ్ పేట-శేఖర్ (వార్త), రాజాపూర్ - శివ ప్రసాద్ గౌడ్ (జనం సాక్షి), అడ్డాకల్ - శేఖర్ (విజయ క్రాంతి), మహబూబ్ నగర్ అనిల్ కుమార్ (సిటి ఇండియా న్యూస్), మహబూబ్ నగర్- శివ కుమార్ (మెగా-9), హన్వాడ - వెంకటేష్ గౌడ్ (దిశ), బాలానగర్ - నర్సింహా రెడ్డి (ఆంధ్రజ్యోతి), మిడ్జిల్- ఎం. శ్రీనివాసులు (మన తెలంగాణ), కోయిల్ కొండ - రామకృష్ణ (వార్త), జడ్చర్ల - వేణు (మన ఊరు), డెస్క్ జర్నలిస్టు - మాణిక్ రావ్ (సాక్షి), మహబూబ్ న‌గ‌ర్ - ఎన్. చంద్ర శేఖర్ గౌడ్ ఫోటో జర్నలిస్టు (మన తెలంగాణ), మహ్మదాబాద్- కొత్త గోపాల్ (విజయ క్రాంతి)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర నాయకులు, జిల్లా సభ్యులు అభినందనలు తెలిపి సన్మానించారు.

Next Story