టీఆర్ఎస్ పాలన మోసపూరితం : వంగ లక్ష్మణ్ గౌడ్

by Disha Web Desk 15 |
టీఆర్ఎస్ పాలన మోసపూరితం : వంగ లక్ష్మణ్ గౌడ్
X

దిశ, బిజినేపల్లి : తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన మోసపూరితమైనదని జనసేన యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్ ఆరోపించారు. మండలంలో కొనసాగుతున్న పల్లెల్లో ఎగరాలి పవనన్న జెండా కార్యక్రమం నేటితో 25వ రోజుకు చేరుకుంది. బుధవారం మండల కేంద్రంలో ప్రతి ఇంటి గడపను సందర్శించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో నిర్వహిస్తున్న పాదయాత్ర కార్యక్రమానికి ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తుందని తెలిపారు. ప్రతి గ్రామంలో జనసేన పార్టీ జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటిని సందర్శిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏవీ నెరవేర్చకుండా ఒంటెద్దు పోకడ పోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టకపోవడంతో రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయని అన్నారు.

ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి, రెండు పడకల గదుల నిర్మాణం చేస్తానని, అవి ఏవీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని మత్తులో ముంచేందుకు బెల్టు షాపులను తీసుకురావడం వల్ల అనేక కుటుంబాలు అనారోగ్య పాలై రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్లు పాలనలో రైతులకు రుణమాఫీ ఊసే లేదని పేర్కొన్నారు. ఎన్నికల ముందు దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్ ఆయనే ఆ కూర్చిలో కూర్చున్నారని విమర్శించారు. బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏమి ఉద్ధరించారని జాతీయ స్థాయికి వెళ్తున్నారని రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తుందని, రాబోయే ఎన్నికల్లో నాగర్కర్నూల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వీరితోపాటు నాయకులు హరినాయక్, కురుమన్న, సూర్య వంశి రెడ్డి ,రాజు నాయక్, శివయ్య, బాలకృష్ణ, పవన్, ఆంజనేయులు, మురళి, నరేష్, శంకర్, శ్రీకాంత్, మల్లేష్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed