- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియా స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన శ్రీజకు సన్మానం
మంగంపేట్ గ్రామానికి చెందిన బండారి శ్రీజ షూటింగ్ బాల్ క్రీడలో తెలంగాణ తరఫున పాల్గొని ఇండియా స్థాయిలో ప్రథమ స్థానం సాధించి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది.

దిశ, మహమ్మదాబాద్ : మంగంపేట్ గ్రామానికి చెందిన బండారి శ్రీజ షూటింగ్ బాల్ క్రీడలో తెలంగాణ తరఫున పాల్గొని ఇండియా స్థాయిలో ప్రథమ స్థానం సాధించి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ఈ నెల 7, 8 తేదీలలో తిరుపతిలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలలో ఆమె ప్రతిభ కనబర్చి విజేతగా నిలిచింది. బండారి సరోజ-రాజు దంపతుల ఏకైక కుమార్తె అయిన శ్రీజ విజయంతో గ్రామంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా ఉమ్మడి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో శ్రీజకు ఘన సన్మానం నిర్వహించారు. పూలమాలలు వేసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. రాష్ట్ర షూటింగ్ బాల్ అధ్యక్షుడు గోపాలం, జిల్లా అధ్యక్షుడు ఆడమ్స్ ముఖ్య అతిథులుగా హాజరై ఆమె ప్రతిభను ప్రశంసించారు. సర్పంచ్‌లు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీజ భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలోను రాణించాలని అందరూ ఆకాంక్షించారు.






