- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డాక్టర్ డేగావత్ రవినాయక్ కి సత్కారం
దిశ, కందనూల్ : ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా సాధించిన డాక్టర్ డేగావత్ రవి నాయక్ కి నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఘనంగా

దిశ, కందనూల్ : ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా సాధించిన డాక్టర్ డేగావత్ రవి నాయక్ కి నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలోని సల్కర్ పేట గ్రామపంచాయతీ తండా వాసులు రెడ్యా నాయక్, చంద్రమ్మ దంపతుల కుమారుడు డాక్టర్ డేగావత్ రవికుమార్ ఉస్మానియా యూనివర్సిటీలో కామర్స్ విభాగంలో పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టరేట్ పొందాడు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ గిరిజన కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా సాధించడం నాగర్ కర్నూల్ జిల్లాకు, ముఖ్యంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి గర్వకారణమన్నారు. బీఆర్ఎస్ కి నిబద్ధతతో పనిచేస్తూ, సల్కర్‌పేట గ్రామ ఉప సర్పంచ్‌గా ప్రజా సేవ చేసిన రవి నాయక్ ఇటీవల గ్రూప్-3 ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కూడా ఎంతో సంతోషకరమని అభినందించారు. జీవితంలో ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మర్రి జనార్ధన్ రెడ్డి ఆకాంక్షించారు.






