- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గిరిజన గురుకుల పాఠశాలకు కొమరం భీమ్ గురుకుల పాఠశాలలుగా నామకరణం చేయాలి : హిందూ వాహిని
దిశ, వనపర్తి టౌన్ : తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన గురుకుల పాఠశాలల పేరును కొమరం భీమ్ గురుకుల పాఠశాలలు గా నామకరణం చేయాలనీ ఉమ్మడి పాలమూరు

దిశ, వనపర్తి టౌన్ : తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన గురుకుల పాఠశాలల పేరును కొమరం భీమ్ గురుకుల పాఠశాలలు గా నామకరణం చేయాలనీ ఉమ్మడి పాలమూరు హిందూ వాహిని విభాగ్ కన్వీనర్ అభిలాష్ హౌదేకార్ డిమాండ్ చేశారు. ఆదివారం వనపర్తి పట్టణంలోని శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో అభిలాష్ హౌదేకార్ మాట్లాడుతూ జల్ జంగల్ జమీన్ నినాదంతో నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా గిరిజనులను చైతన్య పరచిన కొమరం భీమ్ వంటి యోధుని పోరాట పటిమ నేటి తరాలకు గుర్తుండాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన పాఠశాలలకు కొమరం భీమ్ గురుకుల పాఠశాలలు గా మార్చడం ద్వారా సాద్యమైతుందన్నారు. ప్రభుత్వం కానీ ఇందుకు సహకరించకపోతే హిందూ వాహిని ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని జిల్లా కన్వీనర్ అరుణ్ గౌడ్, కో కన్వీనర్ శ్రీకాంత్, నవీన్, శరత్, రాఘవేంద్ర రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.






