దసరా మామూలు పేరుతో ట్రాన్స్‌జెండర్ల దాడి

by velandi.Saikiran |

దసరా పండుగ మామూలు పేరుతో ఓ చిన్న వ్యాపారిపై ట్రాన్స్‌జెండర్ల గుంపు దాడి చేసిన సంఘటన సోమవారం అయిజలో చోటుచేసుకుంది.

దసరా మామూలు పేరుతో ట్రాన్స్‌జెండర్ల దాడి
X

దిశ,గద్వాల క్రైమ్/అయిజ: దసరా పండుగ మామూలు పేరుతో ఓ చిన్న వ్యాపారిపై ట్రాన్స్‌జెండర్ల గుంపు దాడి చేసిన సంఘటన సోమవారం అయిజలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం—తెలంగాణా చౌరస్తా వద్ద చిన్నపాటి పుస్తకాల బుక్స్టాల్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వ్యాపారి వద్దకు ట్రాన్స్‌జెండర్ల గుంపు వచ్చి... దసరా మామూలుగా రూ.500 ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అంత మొత్తం ఇవ్వలేనని వ్యాపారి చెప్పడంతో ఆగ్రహించిన ట్రాన్స్‌జెండర్లు... ఆ చిరు వ్యాపారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిలో వ్యాపారి అపస్మారక స్థితికి చేరుకోవడంతో అటుగా వెళ్తున్న పౌరులు వెంటనే గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ స‌మాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.... గాయపడిన వ్యాపారిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన వారిని గుర్తించే ప్రక్రియను ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

Next Story