ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఎస్ఐల బదిలీలు..

by Taduka Kalyani |

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక ఇన్ స్పెక్టర్, 12 మంది సబ్ ఇన్ స్పెక్టర్లను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఎస్ఐల బదిలీలు..
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక ఇన్ స్పెక్టర్, 12 మంది సబ్ ఇన్ స్పెక్టర్లను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. మహబూబ్ నగర్ సీసీఎస్ లో ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న రామకృష్ణను వికారాబాద్ జిల్లా ఎస్ బీకి బదిలీ చేశారు. భూత్పూర్ ఎస్ఐ-2 విజయ్ భాస్కర్ మూసాపేటకు బదిలీ అయ్యారు. సీసీ కుంట ఎస్ఐ గా పనిచేస్తున్న వై భాగ్యలక్ష్మి రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. నాగర్ కర్నూల్ ఎస్ బీలో పనిచేస్తున్న మాధవరెడ్డి అడ్డాకుల ఎస్ఐగా, వి మోహన్ బాబు సీసీ కుంట ఎస్ఐగా, నాగర్ కర్నూల్ ఎస్ఐ-2 గా పనిచేస్తున్న వెంకటేష్ దేవరకద్ర నియమితులు అయ్యారు.

అడ్డాకుల పనిచేస్తున్న జీ విజయ్ కుమార్ నాగర్ కర్నూల్ వీఆర్ కు, దేవరకద్ర ఎస్ఐగా పనిచేసిన భగవంత్ రెడ్డి, మూసాపేట ఎస్ఐ నరేష్ నాగర్ కర్నూల్ ఎస్ బీకి అయ్యారు. మహబూబ్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎం గోపాల్ నారాయణపేట వీఆర్ కు, అక్కడ పనిచేస్తున్న ఎస్ పెద్ద అంజయ్య మహబూబ్ నగర్ వీఆర్ కు బదిలీ అయ్యారు. సీసీఎస్ లో పనిచేస్తున్న కొత్తపల్లి సాయికుమార్, మహబూబ్ నగర్ టూ టౌన్ ఎస్ఐగా పని చేస్తున్న శేఖర్ రెడ్డి మహబూబ్ నగర్ రూరల్ ఎస్ఐలుగా బదిలీ అయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లా ఎస్పీ నరసింహ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story