ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పలువురు కలెక్టర్ల బదిలీలు

by Ratna Kumari |

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పని చేస్తున్న కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల బదిలీలు జరిగాయి.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పలువురు కలెక్టర్ల బదిలీలు
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పని చేస్తున్న కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల బదిలీలు జరిగాయి. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు బదిలీల ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్ నగర్ కలెక్టర్ గా పని చేస్తున్న బి.విజయేందిర బోయి ని సెక్రటరీ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్సిట్యూషన్ సొసైటీ అండ్ కమీషనర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ హైదరాబాద్ కు, పీఓ ఐటిడిఎ ఉట్నూర్ గా ఉన్న ఖుష్బూ గుప్తా ఐఏఎస్ ను మహబూబ్ నగర్ కలెక్టర్ గా, మహబూబ్ నగర్ లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ను హైదరాబాద్ మెట్రో రైల్ జాయిట్ మేనేజింగ్ డైరెక్టర్ గా, నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను స్పెషల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఫైనాన్షియల్ డిపార్ట్ మెంట్ కు, వికారాబాద్ కలెక్టర్ పత్రిక్ జైన్ ను నారాయణపేట జిల్లా కలెక్టర్ గా బదిలీ చేశారు. అలాగే జోగులాంబ గద్వాల కలెక్టర్ సంతోష్ ను డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ కు, జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ను జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గా, తెలంగాణ మెడికల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ ఫనేంద్ర రెడ్డి ని నారాయణపేట లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ గా, వనపర్తి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ గా పని చేస్తున్న కిమ్యా నాయక్ ను అక్కడే లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ గా బదిలీ చేశారు.

Next Story