- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉమ్మడి జిల్లాలో పలువురు సివిల్ సీఐల బదిలీలు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పలువురు సివిల్ సీఐ లను బదిలీ చేస్తూ హైదరాబాద్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మల్టీజోన్-2 నుంచి గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పలువురు సివిల్ సీఐ లను బదిలీ చేస్తూ హైదరాబాద్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మల్టీజోన్-2 నుంచి గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. మహబూబ్ నగర్ సీసీఎస్ లో పనిచేస్తున్న కె.సుగంధరత్నం ను వనపర్తి జిల్లా సర్కిల్ కు, అక్కడ ఉన్న సీహెచ్.కృష్ణయ్యను మల్టీ జోన్-2 కు రిపోర్ట్ చేయాలని, నల్గొండ జిల్లా మల్టీజోన్-2 లో వెయిటింగ్ లో ఉన్న సీహెచ్.మోతీరాం ను సీసీఎస్ మహబూబ్ నగర్ కు, అలాగే అక్కడే వెయిటింగ్ లో ఎం నర్సింహులు ను మహబూబ్ నగర్ డిసిఆర్బీ కు బదిలీ చేశారు. అలాగే మహబూబ్ నగర్ డిసిఆర్బీ లో పనిచేస్తున్న ఎండి.మగ్ధుమ్ అలి ని హైదరాబాద్ మల్టీజోన్-2 కు రిపోర్ట్ చేయాలని, మహబూబ్ నగర్ ట్రాఫిక్ సీఐ భగవంత్ రెడ్డి ని నారాయణపేట జిల్లా మరికల్ సర్కిల్ కు, అక్కడి సీఐ కె.రాజేందర్ రెడ్డిని మహబూబ్ నగర్ ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేశారు. నల్గొండ డిసిఆర్బీ లో ఉన్న ఎం.రఘవీరా రెడ్డి ని నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ సర్కిల్ కు, అక్కడ ఉన్న డి.విష్ణువర్ధన్ రెడ్డి హైదరాబాద్ మల్టీ జోన్-2 లో రిపోర్ట్ చేయాలని, హైదరాబాద్ సిటి మల్టీ జోన్-2(ఎఫ్)లో వెయిటింగ్ లో ఉన్న వి.ప్రదీప్ కుమార్ ను జోగులాంబ గద్వాల జిల్లా ఎస్ హెచ్ఓ అలంపూర్ సర్కిల్ కు బదిలీ చేశారు. అక్కడ ఉన్న సీఐ రఘుబాబు మల్టీ జోన్-2 లో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి.






