ఎన్నికల నోడల్ అధికారి లేకుండానే పీవోలకు శిక్షణ

by Nallavelli.Anjaneyulu |

దిశ, ఉండవెల్లి : తెలంగాణ రాష్ట్రంలో జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తుండడంతో పివోలకు ఆయా మండల కేంద్రాలలో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ఎన్నికల నోడల్ అధికారి లేకుండానే పీవోలకు  శిక్షణ
X

దిశ, ఉండవెల్లి : తెలంగాణ రాష్ట్రంలో జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తుండడంతో పివోలకు ఆయా మండల కేంద్రాలలో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం లో బుధవారం పీవోలకు నిర్వహించిన శిక్షణ మండల నోడల్ అధికారి లేకుండానే నిర్వహించడం పై వివాదాస్పదం నెలకొంది. ఉదయం 10 గంటలకు నిర్వహించాల్సిన సర్పంచ్ పీవోల శిక్షణ కార్యక్రమం నోడల్ అధికారి స్థానిక ఎంపీడీవో రాకపోవడంతో ఉపాధ్యాయులు గంటన్నర పాటు బయట నిరక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన శిక్షణ కార్యక్రమం మధ్యాహ్నం 12:30 గంటలకే ముగించారు. ఉపాధ్యాయులు బయటికి వెళ్లిన అనంతరం నోడల్ అధికారి శిక్షణ కేంద్రానికి రావడం కోసం మెరుపు. అప్పుడే వచ్చిన మండల నోడల్ అధికారి అక్బర్ కు ఉపాధ్యాయులు తమ సమస్యలను విన్నవించారు.

సొంత గ్రామ పంచాయతీలో నే బూతు స్టేజి అధికారులుగా నియామకం

ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉండవెల్లి మండలంలోని వివిధ గ్రామాలలో స్థానికంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, అదే గ్రామంలో ఎన్నికల బూత్ స్టేజ్ అధికారిగా నియామకాలు చేపట్టడం వివాదాస్పదంగా మారింది. అలాగే ఎస్జిటి ఉపాధ్యాయులను స్టేజి 2అధికారిగా నియమించడం, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను పీవోలుగా నియమించడంపై ఉపాధ్యాయ సంఘం నాయకులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలపై స్థానిక అధికారులకు విన్నవించిన పరిష్కరించడం లేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు.

మెడికల్ గ్రౌండ్స్ ఉన్నవారికి విధుల కేటాయింపు

ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం మెడికల్ గ్రౌండ్స్ ఉన్న ఉద్యోగులను ఎన్నికల విధులకు కేటాయించకూడదని నిబంధన ఉన్న, ఉద్యోగులు మెడికల్ గ్రౌండ్స్ రిపోర్ట్స్ స్థానిక ఎంపీడీవోకు అందజేసిన పీవోలుగా నియమించారని ఉపాధ్యాయులు ఆరోపించారు. బైరాపురంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు మల్లయ్య కు న్యూరో ప్రాబ్లమ్ ఉన్న జెడ్పిటిసి ఎన్నికలకు ఎఆర్ఓ గా నియమించారు. ఉపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్లడంతో విధులను కేటాయించవద్దని ఆదేశాలు జారీ చేశారు. సర్పంచ్ ఎన్నికల కోసం ఇదే ఉపాధ్యాయుడికి పిఓగా విధులు కేటాయించారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న పుల్లూరు గ్రామం ఉపాధ్యాయురాలు జస్టినా, డయాలసిస్ పేషంట్ కతాల్ సాబ్, వెన్నుముక ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న జావీద్ అనిత సంధ్యారాణి, మదర్ ఫీడింగ్ జ్యోతి అనే ఉపాధ్యాయులకు సర్పంచ్ ఎన్నికల పివోలుగా నియమించారు. స్థానిక ఎంఈఓ కు మెడికల్ రిపోర్ట్స్ అందజేసిన కూడా విధులు కేటాయించినట్లు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. జిల్లా స్థాయి అధికారులు ఇప్పటికైనా స్థానిక ఎన్నికల విధులలో నెలకొన్న వివాదాస్పద సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

Next Story