ఎన్నికల నిర్వహణపై అధికార్లకు శిక్షణ

by Ratna Kumari |

దిశ, మక్తల్ : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణపై సోమవారం పోలింగ్ అధికార్లకు శిక్షణ ఇచ్చారు. మక్తల్ లోని బాలుర పాఠశాల్లో ఎంపీడీవో ఎంఈఓ

ఎన్నికల నిర్వహణపై అధికార్లకు శిక్షణ
X

దిశ, మక్తల్ : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణపై సోమవారం పోలింగ్ అధికార్లకు శిక్షణ ఇచ్చారు. మక్తల్ లోని బాలుర పాఠశాల్లో ఎంపీడీవో ఎంఈఓ ఆధ్వర్యంలో దాదాపు 160 మందికి ఎన్నికల్లో ఎన్నికల నియమావళి ప్రకారం విధులు నిర్వహించే విధానంపై పోలింగ్ అధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీల‌కు పార్టీ గుర్తులపై ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికలకు ప్రైవేట్ గుర్తులు ఉంటాయని ఆ గుర్తులతో పోలింగ్ ఉంటుందని తెలిపారు. వీటి నిర్వహణపై ఎన్నికల నిబంధ‌న‌ల ప్రకారం.. కఠినమైన నిబంధనలతో విధులు నిర్వహించాలని సూచించారు. సర్పంచ్ ఎన్నికలైయితే మధ్యాహ్న వరకు పోలింగ్ ఉంటుందని తర్వాత కౌంటింగ్ ఉంటుందన్నారు. ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ కౌంటింగ్ ప్రభుత్వ ఎన్నికల అధికారులు చెప్పిన దాని ప్రకారం ఉంటుందన్నారు.

Next Story