- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్త మరణం మరువక ముందే భార్య మృతి.. అనాధలైన ఐదుగురు పిల్లలు
భర్త మరణం మరువక ముందే భార్య పాముకాటుతో మృతి చెందదండంతో కుటుంబంలో ఐదుగురు పిల్లలు అనాధలుగా మారిన హృదయ విదారక

దిశ, అలంపూర్ : భర్త మరణం మరువక ముందే భార్య పాముకాటుతో మృతి చెందదండంతో కుటుంబంలో ఐదుగురు పిల్లలు అనాధలుగా మారిన హృదయ విదారక సంఘటన వడ్డేపల్లి మండలంలోని కోయిల్ దిన్నే గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన హరిజన తిక్కయ్య (42) ఐదు రోజుల క్రితం గుండె పోటుతో మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. భర్త దినవారాలను బంధువులు, కుటుంబ సభ్యుల మధ్య శనివారం నిర్వహించారు.
రాత్రి పిల్లలతో పాటు నిద్రిస్తున్న తిక్కయ్య భార్య మరియమ్మను (38)పాము కాటేసింది. చికిత్స నిమిత్తం హుటాహుటిన కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. తల్లి తండ్రి ఐదు రోజుల్లోనే మృతి చెందడంతో ముగ్గురు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు ఆనాధలుగా మిగిలారు. మరియమ్మ తిక్కయ్య దంపతులకు సెంటు పొలం కూడా లేకపోవడంతో ఐదుగురు సంతానం పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.
కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దంపతులు ఇరువురు మృతి చెందడం, అంత్యక్రియలకు చిల్లిగవ్వ లేకపోవడంతో గ్రామ యువకులు స్పందించి గ్రామంలో చందాలు వసూలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఆదివారం పోస్టుమార్టం నిర్వహించకపోవడంతో సోమవారం అంత్యక్రియలు నిర్వహించ నున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఐదుగురు చిన్నారులు అనాధలుగా మిగలడంతో గ్రామస్తులందరూ కనిటిపర్వంతమయ్యారు.






