- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్లమల పులుల లెక్కింపులో విషాదం
నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల్ల అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంతంలో గత రెండు రోజులుగా వన్యప్రాణుల లెక్కింపు కొనసాగుతుంది.

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల్ల అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంతంలో గత రెండు రోజులుగా వన్యప్రాణుల లెక్కింపు కొనసాగుతుంది. అమ్రాబాద్ మండలం మాచారం గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాసులు ( 38) అనే వ్యక్తి దోమలపెంట రేంజ్ పరిధిలోని దుర్వాసుల బేస్ క్యాంపు వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. పులుల లెక్కింపులో భాగంగా బుధవారం ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు విధులు నిర్వహిస్తూ తిరిగి వస్తుండగా నడుస్తున్న క్రమంలోనే కుప్పకూలిపోయాడని తెలిపారు. ఈ క్రమంలో వెంటనే అటవీ శాఖ వాహనంలో దాసరి శ్రీనివాసులను హుటాహుటిన అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో పరిశీలించిన వైద్యులు గుండెపోటు రావడంతోనే అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. మృతుడికి భార్య ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు. ఉన్నట్టుండి కుటుంబ యజమాని మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోజున మిందంటాయి. బాధిత కుటుంబాన్ని అడవి శాఖ అధికారులు అన్ని విధాల ఆదుకొని కుటుంబానికి బాసటగా నిలవాలని గ్రామస్తులు కోరుతున్నారు.






