మహిళలపై దూసుకెళ్లిన ట్రాక్టర్.. ఒక‌రు మృతి.. మ‌రొక‌రికి గాయాలు

by Ratna Kumari |

దిశ, ఊట్కూర్ : పొలం పనులకు వెళ్దామని ట్రాక్టర్ తీయగా.. అదుపు తప్పి ఇంటి ముందు కూర్చున్న మహిళల పైకి దూసుకు వెళ్లిన ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూర్

మహిళలపై దూసుకెళ్లిన ట్రాక్టర్.. ఒక‌రు మృతి.. మ‌రొక‌రికి గాయాలు
X

దిశ, ఊట్కూర్ : పొలం పనులకు వెళ్దామని ట్రాక్టర్ తీయగా.. అదుపు తప్పి ఇంటి ముందు కూర్చున్న మహిళల పైకి దూసుకు వెళ్లిన ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని నిడుగుర్తి గ్రామానికి చెందిన అనంతమ్మ ఇంటి వెనకాలే ఉన్న కృష్ణారెడ్డి ఇంటికి పెరుగు తీసుకురావడానికి వెళ్ళింది. అదే సమయంలో కృష్ణారెడ్డి ఇంటి ముందు కూతురు మంజుల తో అనంతమ్మ మాట్లాడుతూ ఉండగా.. కృష్ణారెడ్డి అల్లుడు పొలం పనుల కొరకు వెళ్దామని ట్రాక్టర్ ను స్టార్ట్ చేయగ .. అది అదుపుతప్పి అతివేగంతో ఇంటి ముందు కూర్చున్న అనంతమ్మ, మంజులపై వాహనం దూసుకెల్లగా అనంతమ్మకు తీవ్ర గాయాలు అయ్యాయి. మంజులకు కాలు విరిగింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు వారిని చికిత్స కొరకు దవాఖానకు తరలించారు. అప్పటికే అనంతమ్మ పరిస్థితి విషమించడంతో ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతమ్మ మేనల్లుడు రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

Next Story