- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంగమేశ్వరం ఆలయం వెళ్లే టూరిస్ట్ లు తప్పకుండా లైఫ్ జాకెట్లు ధరించాలి
తెలంగాణ లో ఉన్న సోమశిల నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సంగమేశ్వరాలయానికి వెళ్ళే పర్యాటకులు తప్పకుండా లైఫ్ జాకెట్లు ధరించాలని నాగర్ కర్నూల్ జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ హెచ్చరించారు.

దిశ, కొల్లాపూర్ : తెలంగాణ లో ఉన్న సోమశిల నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సంగమేశ్వరాలయానికి వెళ్ళే పర్యాటకులు తప్పకుండా లైఫ్ జాకెట్లు ధరించాలని నాగర్ కర్నూల్ జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ హెచ్చరించారు. శుక్రవారం సోమశిల గ్రామ సర్పంచ్ కాటం వెంకటలక్ష్మి వెంకటస్వామి బోట్లను సందర్శించి పరిశీలించారు. లైఫ్ జాకెట్లు లేకుండా టూరిస్ట్ లు ప్రయాణించడంతో ప్రతి ఒక్క టూరిస్ట్ లు తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ధరించాలని, లైఫ్ జాకెట్లు ధరించని టూరిస్ట్ లను బోట్ల లో అనుమతించవద్దని టూరిస్ట్ పోలీస్ లను నరసింహ ఆదేశించారు. బోట్ల యజమానులు లైఫ్ జాకెట్లు టూరిస్ట్ లకు ఎల్లవేళలా అందుబాటులో ఉంచాలని, బోట్ల లో పరిమితికి మించి ఎక్కువ మంది టూరిస్ట్ లను ఎక్కించవద్దని, నిబంధనలు అతిక్రమిస్తే బోట్ల యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో టూరిస్ట్ కానిస్టేబుల్ శివ శంకర్, శివ ప్రసాద్ ఉన్నారు.






