విజ‌య్ దేవ‌ర‌కొండ కారుకు ఆదివారం ఫైన్.. సోమ‌వారం యాక్సిడెంట్..!

by Ratna Kumari |

దిశ‌, ఉండ‌వ‌ల్లి : టాలీవుడ్ (Tolly Wood) న‌టుడు విజయ్ దేవరకొండ (Vijay devarakonda ) కారు యాక్సిడెంట్ కు గురైన ఘ‌ట‌న సోమవారం

విజ‌య్ దేవ‌ర‌కొండ కారుకు ఆదివారం ఫైన్.. సోమ‌వారం యాక్సిడెంట్..!
X

దిశ‌, ఉండ‌వ‌ల్లి : టాలీవుడ్ (Tolly Wood) న‌టుడు విజయ్ దేవరకొండ (Vijay devarakonda ) కారు యాక్సిడెంట్ కు గురైన ఘ‌ట‌న సోమవారం సాయంత్రం చోటు చేసుకున్నది. ఎస్సై శేఖర్ తెలిపిన వివరాల ప్ర‌కారం.. హీరో విజయ్ దేవరకొండ, మేనేజర్ రవికాంత్ యాదవ్, డ్రైవర్ అందే శ్రీకాంత్ తో కలిసి పుట్టపర్తి నుంచి హైదరాబాదుకు కారులో వెళ్తున్నారు. ఉండవెల్లి మండలం 44వ జాతీయ రహదారి వరసిద్ధి వినాయక పత్తి మిల్లు దగ్గర ఓ బ‌స్సు అక‌స్మాత్తుగా బ్రేక్ వేయ‌డంతో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌యాణించే కారు బ‌స్సును ఢీ కొట్టింది. దీంతో విజ‌య్ దేవ‌ర‌కొండ కారు పాక్షికంగా దెబ్బ‌తింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే నందికొట్కూర్ నుంచి పెబ్బేర్ కి ప‌శువుల‌ను తీసుకొని వెళ్తున్న వాహ‌నం అక‌స్మాత్తుగా బ్రేక్ వేయ‌డంతోనే బొలోరా వాహ‌నంను విజ‌య్ దేవ‌ర‌కొండ వాహ‌నం ఢీ కొట్టింది. డ్రైవర్ అందే శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. దీంతో విజయ్ దేవరకొండ మరో కారులో హైదరాబాదుకు వెళ్లారు.

మ‌రోవైపు ఆదివారం ఓవర్ స్పీడ్ కార‌ణంగా విజ‌య్ దేవ‌ర‌కొండ కారుకు పైన్ విధించారు. ఇక మ‌రుస‌టి రోజు సోమవారం కారా యాక్సిడెంట్ కావ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టపర్తి కి ఆదివారం ఉదయం బయలుదేరిన విజయ్ దేవరకొండ ఉండవెల్లి మండల శివారులో ఉదయం 11 గంటల ప్రాంతంలో ఓవర్ స్పీడ్ కార‌ణంగా ఫైన్ వేశారు. మ‌ళ్లీ సోమవారం సాయంత్రం ఉండవల్లి శివారులోని వరసిద్ధి వినాయక పత్తి మిల్లు దగ్గర సినీ హీరో విజయ్ దేవరకొండ కారు యాక్సిడెంట్ కావడం గమనార్హం.

Next Story