నేటికి లంబాడీల‌కు ఒక్క మంత్రి ప‌ద‌వి లేదు : మాజీ మంత్రి హ‌రీశ్ రావు

by Ratna Kumari |

కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల ముందు ఎస్సీ, ఎస్టీ డిక్ల‌రేష‌న్ చేశారని.. డిక్ల‌రేష‌న్ ఘ‌నం, ఆచ‌ర‌ణ శూన్యంగా మారింద‌ని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.

నేటికి లంబాడీల‌కు ఒక్క మంత్రి ప‌ద‌వి లేదు : మాజీ మంత్రి హ‌రీశ్ రావు
X

దిశ‌, కొత్త‌ప‌ల్లి : కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల ముందు ఎస్సీ, ఎస్టీ డిక్ల‌రేష‌న్ చేశారని.. డిక్ల‌రేష‌న్ ఘ‌నం, ఆచ‌ర‌ణ శూన్యంగా మారింద‌ని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. శుక్రవారం నారాయణ పేట జిల్లా కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డి పల్లి లో వెలసిన గిరిజనుల ఆరాధ్య దైవమైన బావోజీ దేవాలయంలో మాజీ మంత్రి హ‌రీశ్ రావు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలలో ఎస్టీలకు, ఎస్టీ కార్పొరేషన్‌కు రూ.2730 కోట్లు పెట్టి ఖర్చు మాత్రం రూ. 50 కోట్లు పెట్టారు. ఒక్క ఎస్సీకి, ఎస్టీకి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు. దీన్నిబట్టే ఎస్టీలను కాంగ్రెస్ ఎంత చిన్న చూపు చూస్తుందో అర్థం అవుతుంది అన్నారు. బీఆర్ఎస్ ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది, తండాలను గ్రామపంచాయితీలుగా చేసిందని, మార్కెట్ కమిటీ రిజర్వేషన్ ఇచ్చామ‌ని తెలిపారు. వైన్ షాప్ రిజర్వేషన్ ఇచ్చామని, వందల, వేల కోట్ల రూపాయలు సహకారం అందించామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్,లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, అంజయ్య యాదవ్, పట్నం నరేందర్ రెడ్డి, మండల నాయకులు పాల్గొన్నారు.

Next Story