- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాఠాలు వినాలంటే పట్టాలు దాటాల్సిందే
పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లే విద్యార్థులు, హనుమాన్‌పుర–గిర్నిగడ్డ ప్రాంతాల ప్రజలు ప్రతిరోజూ రైలు పట్టాలు దాటుతూ ప్రాణాలను పణంగా పెడుతున్నారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లే విద్యార్థులు, హనుమాన్‌పుర–గిర్నిగడ్డ ప్రాంతాల ప్రజలు ప్రతిరోజూ రైలు పట్టాలు దాటుతూ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. అండర్‌గ్రౌండ్ బ్రిడ్జి కుంగిపోవడంతో రాకపోకల మార్గం పూర్తిగా నిలిచిపోవడంతో నెలలు తరబడి ప్రజలు రైల్వే లైన్‌పైనే ప్రయాణిస్తున్నారు. నగర పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు, హనుమాన్‌పుర, గిర్నిగడ్డ ప్రాంతాల్లోని దాదాపు 200 ఇళ్ల ప్రజలు గతంలో రైల్వే గేటు ద్వారా రాకపోకలు సాగించేవారు. అయితే నాలుగేళ్ల క్రితం రైల్వే అధికారులు అండర్‌గ్రౌండ్ బ్రిడ్జిని నిర్మించి పాత గేటును తొలగించారు. ఈ సంవత్సరం జూలై, ఆగష్టు వర్షాల్లో బ్రిడ్జి నాణ్యత లోపంతో కుంగిపోవడంతో కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి, మున్సిపల్ అధికారులు పర్యవేక్షించి రాకపోకలకు పూర్తిగా నిషేధం విధించారు. అప్పటి నుండి ప్రజలకూ, విద్యార్థులకూ ప్రత్యామ్నాయ మార్గమే లేక రైల్వే పట్టాలే ఏకైక మార్గంగా మారింది. ఈ ప్రమాదకర పరిస్థితుల మధ్య, మంగళవారం సత్తార్ అనే వృద్ధుడు రైలు ఢీకొట్టి మరణించడం ప్రాంతంలో భయాందోళన కలిగించింది. సరుకులు ఎలా తెచ్చుకోవాలి..?, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ ఎట్లా వస్తుంది..? అంటూ స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇంకా, ద్విచక్ర వాహనాలను రైల్వే కట్ట అవతల పార్క్ చేసి ఇంటికి వెళ్లాల్సి వస్తుండటంతో రాత్రివేళలలో దొంగతనాలు, వాహనాలు, పెట్రోల్ దొంగిలింపులు పెరిగాయని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి మైబన్న తెలిపారు. ప్రజలు తక్షణమే అధికారులు, ప్రజాప్రతినిధులు కలుగజేసుకొని సురక్షిత రాకపోకలు పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.






