స‌మ‌స్యాత్మ‌క పోలీంగ్ కేంద్రాల వ‌ద్ద ప‌టిష్ట బందోబ‌స్తు

by Bhanu |

జిల్లాలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా పోలీస్ సూపరిండెంట్ డి.జానకి తెలిపారు.

స‌మ‌స్యాత్మ‌క పోలీంగ్ కేంద్రాల వ‌ద్ద ప‌టిష్ట బందోబ‌స్తు
X

దిశ, నవాబుపేట : జిల్లాలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా పోలీస్ సూపరిండెంట్ డి.జానకి తెలిపారు. అవసరమైతే అదనపు బలగాలను భద్రత కోసం వినియోగిస్తామని ఆమె అన్నారు. శనివారం మండల పరిధిలోని కారుకొండ, నవాబుపేట, గురుకుంట గ్రామాలలో ఏర్పాటుచేసిన స్థానిక సంస్థల నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించి కేంద్రాలలో జరుగుతున్న నామినేషన్ దాఖలు, స్వీకరణ కార్యకలాపాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ఎన్నికల సమయంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం చేపట్టాల్సిన పలు చర్యల గురించి స్థానిక ఎస్సై విక్రమ్ కు సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా ఉండేందుకు అవసరమైతే అదనపు బలగాలను వినియోగించుకోవాలని ఆమె తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు.

Next Story