నీట్ రీ-ఎగ్జామ్ వేళ ప్రధాని మోడీ మానవత్వం.. ఎయిర్‌పోర్టులోనే 45 నిమిషాల నిరీక్షణ

by Ramesh Naini |

నీట్-యూజీ రీ-ఎగ్జామ్ రాసే విద్యార్థులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ ఒక ప్రశంసనీయమైన నిర్ణయం తీసుకున్నారు.

నీట్ రీ-ఎగ్జామ్ వేళ ప్రధాని మోడీ మానవత్వం.. ఎయిర్‌పోర్టులోనే 45 నిమిషాల నిరీక్షణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: నీట్-యూజీ (NEET-UG) రీ-ఎగ్జామ్ రాసే విద్యార్థులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ ఒక ప్రశంసనీయమైన నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1:15 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని, నేరుగా తన నివాసానికి వెళ్లకుండా ఎయిర్‌పోర్టులోనే కాసేపు వేచి చూశారు. మధ్యాహ్నం 2 గంటలకు నీట్ పరీక్ష ప్రారంభం కానుండటంతో, తన వీఐపీ కాన్వాయ్ వల్ల రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయి విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంలో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఆయన తన ప్రయాణాన్ని కాస్త ఆలస్యం చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే దాదాపు 45 గంటల పాటు ప్రధాని మోడీ ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయారని జాతీయ మీడియా సమాచారం.

కట్టుదిట్టమైన భద్రత నడుమ ‘నీట్’ రీ-ఎగ్జామ్

దేశవ్యాప్తంగా 551 నగరాలు, 14 అంతర్జాతీయ లొకేషన్లలోని 5,440 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. పరీక్షల్లో అవకతవకలను అరికట్టేందుకు 1.38 లక్షల సీసీటీవీ కెమెరాలతో పాటు 51,000 కంటే ఎక్కువ ఎలక్ట్రానిక్ జామర్లను రంగంలోకి దించారు. ముఖ్యంగా ఢిల్లీ లాంటి ప్రధాన నగరాల్లో పరీక్షా కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలతో కఠిన తనిఖీలు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. పరీక్ష కేంద్రాల బయట వేచి ఉన్న తల్లిదండ్రుల కోసం పలు చోట్ల ఉచిత మంచినీరు, అల్పాహార వసతులను కూడా అధికారులు ఏర్పాటు చేశారు.

Next Story