- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ర్యాగింగ్ చేసిన ముగ్గురు విద్యార్థులపై వేటు
నాగర్ కర్నూల్ మెడికల్ కళాశాలలో ఈనెల 25న జూనియర్ విద్యార్థిపై ముగ్గురు సీనియర్లు ర్యాగింగ్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.

దిశ ,నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ మెడికల్ కళాశాలలో ఈనెల 25న జూనియర్ విద్యార్థిపై ముగ్గురు సీనియర్లు ర్యాగింగ్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. మొదటి సంవత్సరం చదువుతున్న దీపక్ శర్మ ను సీనియర్లు హర్షవర్ధన్ లోకేష్ హిమవర్ధన్ లు రూమ్ కి పిలిచి ర్యాగింగ్ చేశారు. దీంతో దీపక్ శర్మ అదే రోజు నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై బుధవారం కళాశాలలో యాంటి ర్యాగింగ్ కమిటీ విద్యార్థుల వారి తల్లిదండ్రులతో కలిసి భేటీ అయ్యారు. ఈ భేటీలో దీపక్ శర్మను ర్యాగింగ్ చేసినట్లు నిర్ధారణ కావడంతో.. ముగ్గురు విద్యార్థులపై వేటు వేశారు. లోకేష్ కు మూడు నెలలు, హిమవర్ధన్ ఒక నెల, హర్షవర్ధన్ రెండు నెలల పాటు కాలేజీ, హాస్టల్ నుండి వేటు వేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రమాదేవి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కి ఎవరైనా పాల్పడితే వారి పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






