వివాహేత‌ర‌ సంబంధం.. వేట కొడవళ్లతో దాడి..ముగ్గురికి తీవ్ర‌గాయాలు

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-11-06 14:47:46  IST  )

దిశ, కల్వకుర్తి : అక్రమ సంబంధం నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మునిసిపాలిటీ పరిధిలోని సంధ్యాపూర్ గ్రామంలో బుధవారం సాయంత్రం దారుణం జరిగింది.

వివాహేత‌ర‌ సంబంధం.. వేట కొడవళ్లతో దాడి..ముగ్గురికి తీవ్ర‌గాయాలు
X

దిశ, కల్వకుర్తి : నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా క‌ల్వ‌కుర్తి మున్సిపాలిటీ ప‌రిధిలోని సంధ్యాపూర్ గ్రామంలో బుధ‌వారం దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ కుటుంబ సభ్యులపై కోడలు, కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలలోకి వెళ్లితే.. కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని సంజాపూర్ గ్రామానికి చెందిన గుర్రం మల్లేష్ కు వెల్దండ మండలం చెరుకూరు గ్రామానికి చెందిన శిరీషతో ఏడాదిన్న‌ర క్రితం వివాహం జ‌రిగింది. వీరికి ఓ కుమారుడు. వీరి వివాహానికి ముందే మల్లేష్ కు సిల్లార్ పల్లి గ్రామానికి చెందిన ఓ యువతీతో వివాహేతర సంబంధం కొనసాగుతూ వచ్చింది. ఈ విషయం తెలిసి పలుమార్లు పెద్దల సమక్షంలో ఇరువురికి న‌చ్చ‌జెప్పారు. అయిన‌ప్ప‌టికీ ఫలితం లేకుండాపోయింది. మూడు నెలల క్రితం మల్లేష్ ఆ యువతితో కలిసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి శిరీష తల్లిదండ్రుల వద్దనే ఉంటుంది. మూడు నెలలైనా మల్లేష్ ఆచూకీ ల‌భించ‌క‌పోవ‌డంతో శిరీష కుటుంబ సభ్యులు సంజాపూరు కు వచ్చారు. అయితే మల్లేష్ తండ్రి జంగయ్య, తల్లి అలివేలు, తమ్ముడు పరమేశ్ తో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య మాట మాట పెర‌గ‌డంతో శిరీష కుటుంబ సభ్యులు ఆగ్రహించి గొడ్డలితో జంగయ్య, అలివేలు, పరమేష్ ల‌పై దాడికి పాల్పడ్డారు. జంగయ్య, పరమేష్ పరిస్థితి విషమంగా ఉంది. అలివేలుకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో మెరుగైన చికిత్స‌ కోసం హైదరాబాద్ కి తరలించారు. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులకు స‌మాచారం ఇవ్వ‌డంతో వెంట‌నే పోలీసులు సంజాపూర్ కి వెళ్లి వివ‌రాల‌ను ఆరా తీశారు. బాధితుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Next Story