- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు సస్పెండ్
విధి నిర్వహణలో తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శించి, బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిన ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

దిశ, నాగర్ కర్నూల్ : ప్రభుత్వం జారీ చేసిన 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు, ఈ-గ్రామ్ స్వరాజ్ పోర్టల్ మార్గదర్శకాలను పాటించకుండా, నిధుల దుర్వినియోగానికి పాల్పడుతూ విధి నిర్వహణలో తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శించి, బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిన ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వంగూరు మండలం పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామపంచాయతీకి చెందిన గ్రేడ్-IV పంచాయతీ కార్యదర్శి పి. కిషన్, కొల్లాపూర్ మండలం పరిధిలోని సింగోటం గ్రామపంచాయతీకి చెందిన గ్రేడ్-III పంచాయతీ కార్యదర్శి పి. అర్జునయ్య, కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి గ్రామపంచాయతీకి చెందిన గ్రేడ్-III పంచాయతీ కార్యదర్శి ఆర్. ప్రేమచంద్‌లను విధుల నుంచి సస్పెండ్ చేసినట్టు కలెక్టర్ బాదావత్ సంతోష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించిన కారణంగా వంగూరు, కొల్లాపూర్ మండలాల పంచాయతీ అధికారులకు షోకాజ్ నోటీసులు చేసినట్టు కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు.






