మద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురికి జైలు శిక్ష

by Ratna Kumari |

దిశ, లోకేశ్వరం : మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ముగ్గురికి న్యాయమూర్తి జైలు శిక్ష వేసిన సంఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఎస్పీ జానకి షర్మిల తెలిపిన వివరాల ప్రకారం..

మద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురికి జైలు శిక్ష
X

దిశ, లోకేశ్వరం : మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ముగ్గురికి న్యాయమూర్తి జైలు శిక్ష వేసిన సంఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఎస్పీ జానకి షర్మిల తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టగా దిలావర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌట్ల గ్రామానికి చెందిన భీమన్న, నర్సాపూర్ (జి) పోలీస్ స్టేషన్ పరిధిలోని కుస్లి గ్రామానికి చెందిన కండెల రాజేశ్వర్, నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్ల పెల్లి గ్రామానికి చెందిన మెస్రం మనోహర్ లు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడగా వారిని పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరచగా.. ద్వితీయ శ్రేణి ప్రత్యేక న్యాయమూర్తి నర్సయ్య భీమన్నకు 10 రోజులు, మెస్రం మనోహర్ కు 6 రోజులు, కండెల రాజేశ్వర్ కు 5 రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలకు హాని కలిగించడం తీవ్రమైన నేరమని, ప్రతిరోజు జిల్లావ్యాప్తంగా విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తనిఖీల్లో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.

Next Story