- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుమ్మెరలో చిన్నారిది ముమ్మాటికి హత్యే : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
కుమ్మెరలో రెండునెలల చిన్నారిది ముమ్మాటికి హత్యేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రాంచందర్ రావు వ్యాఖ్యానించారు.

దిశ, కందనూల్ : కుమ్మెరలో రెండునెలల చిన్నారిది ముమ్మాటికి హత్యేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద దీక్ష శిబిరంలో బాధితులను పరామర్శించిన రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ నేతలను కాపాడేందుకు యత్నిస్తున్నారన్నారు. పోలీసుల నిర్లక్ష్యం చట్టం ఉల్లంఘనేనన్నారు. హోం శాఖ మంత్రి కూడా తానే అయిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకూ స్పందించలేదన్నారు. పార్టీ పెద్దలు కూడా స్పందించలేదన్నారు. జిల్లాలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తున్నదన్నారు. రాష్ట్రంలో పాలనపై సీఎం రేవంత్ రెడ్డి పట్టుకోల్పోయారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు మంత్రుల చేతుల్లోనే పోలీసులు పని చేస్తున్నారన్నారు. నాలుగు రోజుల తర్వాత బీసీ కమిషన్ స్పందించడం దారుణమన్నారు. గుడి వద్ద సంఘటన జరగడం హిందూ ధర్మాన్ని అవమానించడమేనున్నారు. టెంపుల్ కలెక్షన్స్ సెంటర్ కాదని గుడి అందరి కోసం ఉంటుందన్నారు. దేవాలయాల వద్ద డబ్బులు వసూలు బంద్ చేయాలన్నారు.
సీఎం కి దేవి దేవతల పై నమ్మకం లేదని అందుకే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గుడులు అనఫీషియల్ కలెక్షన్ సెంటర్లుగా మారాయన్నారు. భక్తులపై దౌర్జన్యం చేసినంత అమానుష సంఘటన మరొకటి ఉండదన్నారు. సంఘటనపై మెజిస్టీరియల్ ఎంక్వయిరీ చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై, తప్పు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. సంఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు. పెద్ద జాతరలను ఎండోమెంట్ శాఖ పర్యవేక్షించాలని, ఎండోమెంట్లో లేని దేవాలయాలను కూడా ఆ శాఖ పరిరక్షించాలన్నారు. జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి మాట్లాడుతూ అధికార పార్టీకి తలొగ్గి, సంఘటన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎస్ఐలపై రాష్ట్ర పార్టీ తరఫున జాతీయ బీసీ కమిషన్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తామన్నారు. వారిని ఢిల్లీకి పిలిపించి విచారింపజేస్తామన్నారు. ఇంత సంఘటన జరిగిన స్పందించని కలెక్టర్ ఎస్పీ ఎస్ఐల నిర్లక్ష్యంపై చర్యలు తప్పవన్నారు. కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించిన ఎస్సైని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్, ఎస్పీలు ఎవరిని చూసి భయపడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. బాధితులకు న్యాయం జరిగే అంత వరకూ ఎంత దూరమైనా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్ రావు, మాజీ జిల్లా అధ్యక్షుడు బుసిరెడ్డి సుబ్బారెడ్డి, దిలీపాచారి, సుధాకర్ రెడ్డి, నాగేంద్రం గౌడ్ పాల్గొన్నారు.






