ఇదేం రోడ్డు బాబోయ్..? అదుపు త‌ప్పితే అంతే..!

by Ratna Kumari |

దిశ, ఊట్కూర్ : స‌మిస్తాపూర్ స్టేజీ నుంచి క‌ర్ణాట‌క బార్డ‌ర్ వ‌ర‌కు పూర్తిగా ర‌హ‌దారి గుంత‌ల‌మ‌యంగా మారింది. అడుగుకొక గుంత‌.. గ‌జానికి ఒక గొయ్యి అన్న‌ట్టుగా మారింది. మండల కేంద్రం నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో కర్ణాటక

ఇదేం రోడ్డు బాబోయ్..? అదుపు త‌ప్పితే అంతే..!
X

దిశ, ఊట్కూర్ : స‌మిస్తాపూర్ స్టేజీ నుంచి క‌ర్ణాట‌క బార్డ‌ర్ వ‌ర‌కు పూర్తిగా ర‌హ‌దారి గుంత‌ల‌మ‌యంగా మారింది. అడుగుకొక గుంత‌.. గ‌జానికి ఒక గొయ్యి అన్న‌ట్టుగా మారింది. మండల కేంద్రం నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రానికి వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి.. తెలంగాణ కర్ణాటక సరిహద్దు లో ఉన్న శంకర్లింగేశ్వర స్వామి దేవాలయం కు నిత్యం వేలాది మంది భక్తులు వెళ్తున్న రహదారి లేకపోవడం శోచనీయం. ఏళ్లు గడుస్తున్న పాలకులు పట్టించుకోకపోవడం.. అడపా దడపా తూతూ మంత్రంగా మరమ్మత్తులు తప్ప శాశ్వత పరిష్కారం దొరకటం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. నిత్యం వందలాది వాహనాల రాకపోకలు కొనసాగిస్తున్న రహదారిని పట్టించుకునే నాధుడే కరువయ్యాడని వాహనదారులు వాపోతున్నారు. వర్షకాలం మొదటి నుంచి రోడ్డు పై నీరు నిలిచి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి బురుధ ఏర్పడటంతో వాహనదారులు గుంతలలో పడుతూ లేస్తూ ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. కొంతమంది ద్విచక్రలపై వెళ్లే సమయంలో బురదలో పడి పలువురు కి గాయాలు కూడా అయ్యాయి. ఈ రహదారి గుండా వెళ్లాలంటే బురదైనా.. గాయాలైన తప్పనిసరిగా అనే మాదిరిగా మారిందని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని గుంతల మయంగా మారిన రహదారికు మరమ్మతులు చేయించాలని వాహనదారులు, ఇరు రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారు.

Next Story