బండ‌రాయిపాకుల‌లో దొంగ‌లు హ‌ల్ చ‌ల్

by Ratna Kumari |

దిశ‌, రేవ‌ల్లి : మండల పరిధిలోని బండరాయిపాకుల గ్రామంలో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగలు హ‌ల్ చ‌ల్ సృష్టించారు. ముఖ్యంగా మూడు ఇళ్ల‌లో అందినకాడికి

బండ‌రాయిపాకుల‌లో దొంగ‌లు హ‌ల్ చ‌ల్
X

దిశ‌, రేవ‌ల్లి : మండల పరిధిలోని బండరాయిపాకుల గ్రామంలో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగలు హ‌ల్ చ‌ల్ సృష్టించారు. ముఖ్యంగా మూడు ఇళ్ల‌లో అందినకాడికి దోచుకొని అక్కడే ఉన్న ద్విచక్ర వాహనం పై ఉడాయించారు. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. సోమవారం అర్ధరాత్రి జాన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సుధాకర్ రెడ్డి ఇళ్ల‌ను యజమానులు ఇంట్లో లేని సమయంలో తాళాలు పగలగొట్టి తీరిక‌గా కూర్చొని ఇంట్లో ఉన్న బీరువాలు బద్దలు కొట్టి అందులోని వస్తువులను చిందరవందరగా పడేసి అందిన కాడికి దోచుకుని పరారయ్యారు. ఆ పక్కనే అద్దెకు నివాసం ఉండే సర్వేశ్వరరావు ద్విచక్ర వాహనం తాళాలను తీసేసి యదేచ్చగా వాహనంపై ఇద్దరి యువకులు ప‌రార్ అయ్యారు. అక్కడి సీసీ కెమెరాల్లో రికార్దయింది. మంగళవారం స్థానిక పోలీసులు పోలీస్ l జాగిలాలను తెచ్చి అన్వేషించినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. అదే గ్రామానికి చెందిన ఐదుగురు యువకులను ప్రతి రోజు చేపలవేటకు వెళ్తుంటారు. వారు వెళ్తున్నది సీసీ కెమెరాలు రికార్డు అవ్వడంతో వారిపై అనుమానంతో స్థానిక పోలీస్ స్టేషన్ లకు తరలించి విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి విచారణ జ‌రుగుతుంద‌ని త్వరలోనే వివరాలను అందిస్తానని ఎస్సై రజిత తెలిపారు.

Next Story