ఆమె చనిపోయింది అనుకున్నారు.. కానీ ఆ త‌రువాత ఏం జ‌రిగిందంటే..?

by Nallavelli.Anjaneyulu |

దిశ, మిడ్జిల్ : సాధార‌ణంగా కొన్ని సంద‌ర్భాల్లో చిత్ర‌, విచిత్ర ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటాయి. అయితే అప్పుల బాధ‌తో మిడ్జిల్

ఆమె చనిపోయింది అనుకున్నారు.. కానీ ఆ త‌రువాత ఏం జ‌రిగిందంటే..?
X

దిశ, మిడ్జిల్ : సాధార‌ణంగా కొన్ని సంద‌ర్భాల్లో చిత్ర‌, విచిత్ర ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటాయి. అయితే అప్పుల బాధ‌తో మిడ్జిల్ మండ‌ల ప‌రిధిలోని మున్న‌నూర్ గ్రామంలో ఓ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. అయితే కుటుంబ స‌భ్యులు, గ్రామస్తులంతా ఆ మ‌హిళ మ‌ర‌ణించింద‌ని భావించారు. కానీ అస‌లు ఏం జ‌రిగిందంటే..? కుటుంబ స‌భ్యులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మున్న‌నూర్ గ్రామానికి చెందిన దేవ‌త‌ల శ్రీశైలం, మాస‌మ్మ భార్య భ‌ర్త‌లు. ఇవాళ ఉద‌యం మాస‌మ్మ నిద్రిస్తున్న చోట‌నే ఎలాంటి క‌ద‌లిక‌లు లేకుండా ఉంది. ఇది గ‌మ‌నించిన భ‌ర్త‌, కుటుంబ స‌భ్యులంతా మాస‌మ్మ మ‌ర‌ణించింద‌ని బాధ‌లో ఉన్నారు. అయితే ఇంటి ప‌క్క‌ల జ‌నం వ‌చ్చి గుంపులు గుంపులుగా కూడారు. అయితే అంత‌లోనే గ్రామానికి చెందిన గోపాల‌మిత్ర న‌ర‌సింహ వెళ్లి చూసారు. వెంట‌నే అత‌ను మాస‌మ్మ‌కి సీపీఆర్ చేశాడు. దీంతో మాస‌మ్మ మెల్ల‌గా స్పృహ‌లోకి వ‌చ్చింది. కుటుంబ స‌భ్యులు వెంట‌నే 108 లో మెరుగైన చికిత్స కోసం జ‌డ్చ‌ర్ల ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్య ప‌రిస్థితి బాగానే ఉన్న‌ట్టు స‌మాచారం. గోపాల మిత్ర న‌ర‌సింహ స‌మ‌యానికి సీపీఆర్ చేయ‌డం వ‌ల్ల ప్రాణాలు ద‌క్క‌డంతో అత‌న్ని అభినందించారు.

Next Story