ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలి : డీపీఓ సుధాక‌ర్ రెడ్డి

by Ratna Kumari |

ప్రభుత్వం ఇచ్చే నిధులను సద్వినియోగం చేసుకొని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డీపీఓ సుధాకర్ రెడ్డి అన్నారు.

ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలి : డీపీఓ సుధాక‌ర్ రెడ్డి
X

దిశ, ధన్వాడ : ప్రభుత్వం ఇచ్చే నిధులను సద్వినియోగం చేసుకొని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డీపీఓ సుధాకర్ రెడ్డి అన్నారు. ధన్వాడ రైతు వేదికలో గురువారం వార్డు సభ్యుల శిక్షణ శిబిరాన్ని సందర్శించి వార్డు సభ్యులతో మాట్లాడారు. చట్టాల పై విధులు బాధ్యతలపై ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకు అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేకంగా ఐదు రోజుల పాటు శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని డీపీఓ తెలిపారు. జిల్లా కేంద్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు అందరికీ శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుతం నూతనంగా గెలిచిన వార్డు సభ్యులందరికీ శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ శిక్షణలో గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు సమావేశాలు తదితర అంశాల గురించి తెలుసుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం గ్రామాల్లో అనేక సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. ఈ సమావేశంలో గ్రామ కార్యదర్శి శ్రీనివాసరావు, శిక్షకులు పాల్గొన్నారు.

Next Story