నిజాయితీకి నిదర్శనం ఈ మహిళలు.. దొరికిన డ‌బ్బులు పోలీసుల‌కు అప్ప‌గింత‌..!

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-11-06 09:00:40  IST  )

దిశ, గద్వాల క్రైం : గద్వాల పట్టణంలోని బాలికల పాఠశాల ముందు ఒక అపూర్వ సంఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై ఎవరివో గుర్తు తెలియని వ్యక్తులకు చెందిన ₹5,000 నగదు పడిపోయింది.

నిజాయితీకి నిదర్శనం ఈ మహిళలు.. దొరికిన డ‌బ్బులు పోలీసుల‌కు అప్ప‌గింత‌..!
X

దిశ, గద్వాల క్రైం : గద్వాల పట్టణంలోని బాలికల పాఠశాల ముందు ఒక అపూర్వ సంఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై ఎవరివో గుర్తు తెలియని వ్యక్తులకు చెందిన ₹5,000 నగదు పడిపోయింది. అదే సమయంలో ఆ దారిలో వెళ్తున్న దౌదర్ పల్లిలో నివాసం ఉంటున్న కంట్లో నలుసు తీసే ముగ్గురు మహిళలకు ఆ డబ్బులు కనిపించాయి. వారు ఆ నగదును తమ వద్ద ఉంచుకోకుండా, నిజాయితీకి నిదర్శనంగా గద్వాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడుకు అప్పగించారు. ఈ సందర్భంలో ఎస్ఐ బాలచంద్రుడు మాట్లాడుతూ ఇలాంటి నిజాయితీ గల మహిళలు సమాజానికి ఆదర్శం. ఇలాంటి మనుషుల వల్లే నమ్మకం నిలుస్తుంది” అని పేర్కొన్నారు. నగదు కోల్పోయిన వారు గద్వాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి తమ వివరాలు ఇచ్చుకోవచ్చని తెలిపారు. ఈ ఘటన గద్వాల పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఆ మహిళల నిజాయితీని పలువురు ప్రశంసిస్తున్నారు.

Next Story