కొల్లాపూర్ మున్సిపాలిటీలో వార్డుల రిజర్వేషన్లు ఇవే..!

by Nallavelli.Anjaneyulu |

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శనివారం కొల్లాపూర్ మున్సిపాలిటీలోని 19 వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లను డిప్ ద్వారా ఖరారు చేశారు.

కొల్లాపూర్ మున్సిపాలిటీలో వార్డుల రిజర్వేషన్లు ఇవే..!
X

దిశ, కొల్లాపూర్ : నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శనివారం కొల్లాపూర్ మున్సిపాలిటీలోని 19 వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లను డిప్ ద్వారా ఖరారు చేశారు. కొల్లాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ బీసీ మహిళ కు రాష్ట్ర ఎన్నికల సంఘం రిజర్వ్ చేసింది. వార్డుల వారిగా రిజర్వేషన్ వివరాలను కొల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర రావు వెల్లడించారు. 1,2 వార్డులు మహిళలకు రిజర్వ్ 3వ వార్డు ఎస్సీ మహిళ 4, 5 వార్డులు జనరల్ రిజర్వ్ అయ్యాయి.6,7 వార్డులు బీసీ మహిళ,8,9 వార్డులు బీసీ జనరల్,10 వ వార్డు ఎస్సీ జనరల్,11,13 వార్డులు అన్ రిజర్వ్ మహిళ,12 వార్డు బీసీ మహిళ,14,16 వార్డులు ఆన్ రిజర్వ్ జనరల్,15 వార్డు ఎస్టీ జనరల్,17 వార్డు ఎస్సీ జనరల్,18,19 వార్డులు అన్ రిజర్వ్ మహిళ కు ఖరారయ్యాయి.

Next Story