- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కలిగి ఉండాలి : అదనపు కలెక్టర్ శ్రీను
దిశ, నారాయణపేట జిల్లా ప్రతినిధి : మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ శ్రీను పేర్కొన్నారు.

దిశ, నారాయణపేట జిల్లా ప్రతినిధి : మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ శ్రీను పేర్కొన్నారు. నారాయణపేట జిల్లాలో మాదక ద్రవ్యాల నిషేధాన్ని పగడ్బందీగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో మాదక ద్రవ్యాల నిషేదం పై ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం డ్రగ్స్ పై సీరియస్ గా ఉందని చెప్పారు. మన జిల్లాలో ఎక్కడైనా గంజాయి సాగు చేసిన సంఘటనలు ఉన్నాయా అని డీ ఏ వో జాన్ సుధాకర్ ను ప్రశ్నించగా అలాంటి సంఘటనలు ఏమీ లేవని ఆయన తెలిపారు. జిల్లాలోని అన్ని జూనియర్, డిగ్రీ కళాశాలలతో పాటు జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో యాoటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసి, ఆయా కమిటీల నేతృత్వంలో మాదకద్రవ్యాల నిషేధంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.
జిల్లాలో పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, డిగ్రీ,జూనియర్ జూనియర్ కళాశాలలోనే కాకుండా పాఠశాలలలోనూ మాదకద్రవ్యాల నిషేధంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. సమావేశంలో డీఎస్పీ నల్లపు లింగయ్య మాట్లాడుతూ నవంబర్ నెలలో 12 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని.. 17 మందిపై కేసు నమోదు చేశామని తెలిపారు. అలాగే కొంత మందిని రిమాండ్ కి తరలించినట్టు వెల్లడించారు. యాంటీ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. పబ్లిక్ స్థలాల్లో, కల్లు దుకాణాల్లో, మద్యం, బార్ అండ్ రెస్టారెంట్ ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అబ్కారీ శాఖ సీఐ అనంతయ్య, డీఐ ఈవో సుదర్శన్, అశోక్ కుమార్, రాజేందర్, రాణి దేవి, డ్రగ్ ఇన్స్ స్పెక్టర్, ఎక్సైజ్ సీఐ పాల్గొన్నారు.






