ఈకేవైసీ కి గ‌డువు అంటూ లేదు.. నిరంత‌ర ప్ర‌క్రియ

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, మ‌క్త‌ల్ : రేషన్ కార్డులోని సభ్యులు ఈకేవైసీ చేసుకోవడానికి గడువంటూ ఏది లేదని నారాయణ పేట జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం

ఈకేవైసీ కి గ‌డువు అంటూ లేదు.. నిరంత‌ర ప్ర‌క్రియ
X

దిశ‌, మ‌క్త‌ల్ : రేషన్ కార్డులోని సభ్యులు ఈకేవైసీ చేసుకోవడానికి గడువంటూ ఏది లేదని నారాయణ పేట జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శి గుడిగండ్ల చంద్ర శేఖర్, అమరేందర్ రెడ్డి తెలిపారు. ఈజేవైసీ నిరంతరం కొనసాగే ప్రక్రియ అని, ఈనెల31 వరకే గడువు ఉందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్త‌వం లేద‌ని, ఆ తర్వాత ఈకేవైసీ చేయించు కోని వారికి సన్న బియ్యం ఇవ్వరు అనేది అవాస్తమైన వార్త అని వారు తెలిపారు. బియ్యం కోసం వెళ్లినప్పుడు ఈకేవైసీ చేసుకోవచ్చని ఉచితంగానే డీలర్లతో ఈకేవైసీ చేయడం జరుగుతుందన్నారు. రేషన్ కార్డులో ఉన్న వారిలో ఎవరన్నా ఒకరు ఈకే వైసి చేసుకుంటే సరిపోతుందని మీగత వారు ఎప్పు డైనా చేసుకోవచ్చన్నారు. గడిచిన ఐదు నెల‌ల‌ నుంచి డీలర్లకు వచ్చే కమిషన్ అగిపోయిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డీలర్ల ఖాతాలోకి కమిషన్ డబ్బులను వేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

Next Story