దిశ క‌థ‌నం పై పోలీసుల్లో క‌ద‌లిక

by Ratna Kumari |

సంగంబండ రోడ్డులో ఉన్న ప‌లు కాల‌నీల్లో న‌ల్ల ముసుగు ధ‌రించి అర్థ‌రాత్రి హ‌ల్ చ‌ల్ చేశాడ‌ని దిశ ప‌త్రిక‌లో ఓ క‌థ‌నం వెలువ‌డింది.

దిశ క‌థ‌నం పై పోలీసుల్లో క‌ద‌లిక
X

దిశ‌, మ‌క్త‌ల్ : సంగంబండ రోడ్డులో ఉన్న ప‌లు కాల‌నీల్లో న‌ల్ల ముసుగు ధ‌రించి అర్థ‌రాత్రి హ‌ల్ చ‌ల్ చేశాడ‌ని దిశ ప‌త్రిక‌లో ఓ క‌థ‌నం వెలువ‌డింది. ఈ సంఘ‌ట‌న పై పోలీసులు ఆరా తీశారు. అస‌లు ఈ సంఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగింది..? బాధిత కుటుంబాలు ఎవ‌రు అనే విష‌యాన్ని దిశ ప్ర‌తినిధిని పోలీసులు ప్ర‌శ్నించారు. జ‌రిగిన సంఘ‌ట‌న పై త‌మ దృష్టికి తీసుకొస్తే విచారిస్తామ‌ని తెలిపారు పోలీసులు. మ‌క్త‌ల్ ప‌ట్ట‌ణంలో గ‌త మూడు రోజుల కింద‌ట కురిస‌న వ‌ర్షాల వ‌ల్ల రాత్రి పూట క‌రెంట్ ఉండ‌టం లేదు. కాల‌నీల్లో కొంద‌రూ ఉక్క‌పోత కార‌ణంగా ఆరుబ‌య‌ట నిద్రిస్తున్నారు. కాక‌తీయ స్కూల్ ప‌రిస‌ర ప్రాంతంలో అర్థ‌రాత్రి న‌ల్ల‌ముసుగు ధ‌రించిఓ వ్య‌క్తి హ‌ల్ చ‌ల్ చేశాడు.

దాదాపు 25 సంవ‌త్స‌రాల లోపు వ‌య‌స్సు గ‌ల వ్య‌క్తి న‌ల్ల పాయింట్, టీష‌ర్ట్ ధ‌రించి వీధుల్లో తిరిగాడ‌ని.. ఓ ఇంటిపై అంత‌స్తుకు మెట్ల ద్వారా వెళ్తుండ‌గా గ‌మ‌నించిన గృహిణి కేక‌లు వేసింద‌ని.. దీంతో ఆ వ్య‌క్తి ప‌రార‌య్యాడ‌ని కాల‌నీవాసులు పేర్కొంటున్నారు. గ‌తంలో దొంగ‌త‌నాల నివార‌ణ కోసం స్పెష‌ల్ పార్టీ పోలీసులు వీధుల్లో గ‌స్తీ నిర్వ‌హించేవార‌ని.. ప్ర‌స్తుతం కూడా అలాగే నిర్వ‌హించాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు. లేకుంటే ఇలాంటి ఘ‌ట‌న‌లు నిత్యం చోటు చేసుకుంటాయ‌ని పేర్కొంటున్నారు.

Next Story