డబుల్ ఇంజన్ సర్కారు ఆవశ్యకత ఉంది : ఎంపీ డీ.కే.అరుణ‌

by Ratna Kumari |

దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి : కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు రావాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందని పార్లమెంటు సభ్యురాలు డికె అరుణ వ్యాఖ్యానించారు.

డబుల్ ఇంజన్ సర్కారు ఆవశ్యకత ఉంది : ఎంపీ డీ.కే.అరుణ‌
X

దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి : కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు రావాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందని పార్లమెంటు సభ్యురాలు డికె అరుణ వ్యాఖ్యానించారు. ఆదివారం సాయంత్రం మహబూబ్ నగర్ పట్టణంలోని ఆమె క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో నుండి పెద్ద ఎత్తున బీజేపీ లో చేరిన సందర్భంగా వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గాడి తప్పిందని, సీఎం రేవంత్ రెడ్డి అనుభవ లోపం వలన,ఇచ్చిన హామీలు అమలు జరపలేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె విమర్శించారు. గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని, దేశం అభివృద్ధి చెందితేనే ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తారని,అది బీజేపీ తోనే సాధ్యమని ఆమె అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి రూపాయి అర్హులకే చేరాలంటే అక్కడ, ఇక్కడ ఒకే ప్రభుత్వం ఉంటేనే అది సాధ్యమన్నారు. భవిష్యత్తు రాజకీయాల్లో యువతదే కీలకపాత్ర అని, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండి, అత్యధికంగా బీజేపీ అభ్యర్థులను గెలిపించుకొని గ్రామ అభివృద్దికి తోడ్పాటు నివ్వాలని ఆమె పిలుపునిచ్చారు.

Next Story