దొంగ‌త‌నాలను క‌ట్ట‌డి చేయ‌డ‌మే త‌మ ల‌క్ష్యం : ఎస్సై సీ హెచ్ హరిప్రసాద్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |

దిశ, తిమ్మాజీపేట : దొంగతనాలను కట్టడి చేయడమే తమ లక్ష్యమని ఎస్సై సీహెచ్ హరిప్రసాద్ రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని కొడుపర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

దొంగ‌త‌నాలను క‌ట్ట‌డి చేయ‌డ‌మే త‌మ ల‌క్ష్యం : ఎస్సై సీ హెచ్ హరిప్రసాద్ రెడ్డి
X

దిశ, తిమ్మాజీపేట : దొంగతనాలను కట్టడి చేయడమే తమ లక్ష్యమని ఎస్సై సీహెచ్ హరిప్రసాద్ రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని కొడుపర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా మండలంలోని అన్ని గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వ‌హించారు. ప్రజలకు వివరించడం జరిగిందన్నారు. అలాగే రాత్రి సమయంలో పెట్రోలింగ్ చేస్తూ గస్తీలలో ప్రజలకు ఎలాంటి కష్టం, నష్టం రాకుండా అందుబాటులో ఉండి వారి ప్రయోజనాలను కాపాడాల్సిన పని మన పై ఉందన్నారు. మూడు లక్షల రూపాయలతో ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలతో పాటు మానిటరింగ్ టవర్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన దాతలు కొడుపర్తి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిలుక సురేందర్ రెడ్డి, చిలుక రాజేందర్ రెడ్డి ఎస్సై కు చెక్ రూపంలో అందజేశారు. దాతలు ముందుకు రావడం పోలీస్ శాఖ తరుపున‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎస్సై వారికి ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఈ విషయం తెలుసుకున్న మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రామ్ రెడ్డి, రాష్ట్ర టెలికాం శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ బహదూర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగది మల్లయ్యా గౌడ్,మార్కెట్ కమిటీ డైరక్టర్ మాధవులు, చిలుక అశోక్ రెడ్డి, చిలుక భాస్కర్ రెడ్డి, భాస్కర్ గౌడ్, లక్ష్మి నారాయణ పాల్గొన్నారు.

Next Story