బంగారు ఆభ‌ర‌ణాలు చోరీ

by Ratna Kumari |

దిశ, వంగూర్ : బంగారు ఆభ‌ర‌ణాలు చోరీ జ‌రిగిన సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని తుమ్మ‌లప‌ల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై మ‌హేష్ గౌడ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండ‌ల ప‌రిధిలోని తుమ్మ‌ల‌ప‌ల్లి గ్రామానికి

బంగారు ఆభ‌ర‌ణాలు చోరీ
X

దిశ, వంగూర్ : బంగారు ఆభ‌ర‌ణాలు చోరీ జ‌రిగిన సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని తుమ్మ‌లప‌ల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై మ‌హేష్ గౌడ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండ‌ల ప‌రిధిలోని తుమ్మ‌ల‌ప‌ల్లి గ్రామానికి చెందిన ఆరె కంటి నిరంజన్ ఉదయం 9 గంటల 40 నిమిషాలకు ఇంటికి తాళం వేసి గుడికి వెళ్లాడు. తిరిగి 10 గంటల 30 నిమిషాలకు ఇంటికి వచ్చి చూడగా తాళం విరిగి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగానే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బీరువా తెరిచి బంగారు ఆభరణాలు, వెండి పట్టీలు, 20 వేలు నగదు మొత్తం విలువ 90 వేలు దొంగలించినట్లు నిరంజన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Next Story