వ్యవసాయ పంపు సెట్లు చోరీ.. సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి..!

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, మ‌క్త‌ల్ : రెండు రాష్ట్రాల సరిహద్దులు కృష్ణా నది పరివాక ప్రాంతంలో వ్యవసాయ పంపు సెట్ల దొంగతనంలో మక్తల్ మండల గుడిగండ్లకు చెందిన విజయ్ ని ఆది క‌ర్నాట‌క శ‌క్తిన‌గ‌ర్ శక్తి నగర్ రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే.

వ్యవసాయ పంపు సెట్లు చోరీ.. సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి..!
X

దిశ‌, మ‌క్త‌ల్ : రెండు రాష్ట్రాల సరిహద్దులు కృష్ణా నది పరివాక ప్రాంతంలో వ్యవసాయ పంపు సెట్ల దొంగతనంలో మక్తల్ మండల గుడిగండ్లకు చెందిన విజయ్ ని ఆది క‌ర్నాట‌క శ‌క్తిన‌గ‌ర్ శక్తి నగర్ రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. కృష్ణా నది పరవాక ప్రాంతంలో అటు కర్ణాటకలో శక్తి నగర్ పోలీస్ స్టేషన్, ఇటు మక్తల్ నియోజకవర్గం కృష్ణ పోలీస్ స్టేషన్ల పరిధిలో నదీ పరివాహక ప్రాంతంలో వ్యవసాయ పంప్ సెట్లు మాయమ‌వుతున్నాయ‌ని.. దొంగతనాలపై నిందితుడు విజయ్ ని ఆది రాయచూరు పోలీసులు ఆరాతీయగా వీరి నేర చరిత్ర బయటపడింది. మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామానికి చెందిన విజయ్ మక్తల్ లో మోటర్ మెకానిక్ వర్కింగ్ షాప్ పెట్టి దానిని కృష్ణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరిహద్దు టై రొడ్డు దగ్గర బ్రాంచిని ప్రారంభించి కరెంటు మోటార్ల వైన్డింగ్ రిపేర్ షాప్ అనతికాలంలోనే అభివృద్ధి చెంది లక్షల ప్రాపర్టీ కి ఓనర్ అయ్యాడు. అందుకు తను రాత్రి పగలు తేడా లేకుండా పనిచేయడంతో తను స్థిరపడ్డానని స్వ‌ గ్రామం లో మిత్రులతో చెప్పుకునేవాడని సమాచారం. ఇలా చోరీ చేసిన వ్యవసాయం పంపుసెట్లను గ్రామానికి తీసుకొచ్చి రంగు మార్చి మోటార్ పై నకిలి లేబుల్ ప్లేటు అమర్చి బంధువుల ద్వారా రైతులకు విక్రయించి లబ్ధి పొందేవాడని నేర చరిత్ర ఉందని గ్రామస్తులు అంటున్నారు,

కర్ణాటక రాష్ట్రం శక్తి నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణ పరివాహక ప్రాంతంలో వరి పొలాలన్ని కోతపడ్డంతో నది పరివిహకప్రాంతంలో రైతులు వెళ్లకపోవడంతో ఇదే మంచి సమయమని భావించిన వీరు గంజిపల్లిలో గ్రామ పరిసరాల్లో రాత్రి సమయం వ్యవసాయ పంపు సెట్లను ముగ్గురు అను చరులతో చోరీ చేస్తుండగా గ్రామస్తులు ఇద్దరిని పట్టు కొని పోలీసులకు అప్పగించారు కర్ణాటక పోలీసులు. తెలంగాణ ప్రాంత రైతుల కథనం ప్రకారం.. కృష్ణా పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడేబల్లూర్ పంచాయతీలోని టైరోడ్డులో కరేంటు మోటర్లను రిపేర్లు చేసేందుకు మక్తల్ మండలం గుడిగండ్లకు చెందిన విజయ్ కొంతకాలం కిందట ఇక్కడికి వచ్చి దుకాణం పెట్టి మోటర్లను రిపేర్లు చేసేవాడు. కొంత కాలంగా కృష్ణా మండలంలోని కుసుమర్తి, తంగిడి, సూకూర్ గంపల్లి, హిందూపూర్,గుడేబల్లూర్ తదితర గ్రామాల్లో పొలాల్లోని మోటర్లను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లే సంఘటనలు చోటు చేసుకున్నాయి రైతులు అంటున్నారు. కృష్ణా నది అటువైపు కర్నాటక శక్తి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంజిపల్లి గ్రామ పరిసరాలో శనిరాత్రి వ్యవసాయ పొలాల్లో ని మోటర్లను ఎత్తుకెళ్లేందుకు విజయ్ కు తోడుగా తమ్ముడు ఆది, హుస్సేన్ వెళ్లారు. మోటర్లను ఎత్తుకెళ్తుండగా.. హుస్సేన్ తప్పించుకోగా ఇద్దరిని రైతులు పట్టుకొని రాయిచూర్ పోలీసులకు అప్పగించారు.

ఇది ఇలాఉండగా వీరిని పోలీసులు విచారించగా పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. దాని ప్రకారం.. ఆదివారం సాయంత్రం 7గంటల సమయంలో టైరోడ్డులోని విజయ్ దుకాణం, నివాసంలో తనిఖీ చేయగా పెద్ద మొత్తంలో కరెంట్ మోటర్లు భయట పడ్డాయి. వీటి విలువ దాదాపు ఏడు లక్షల వరకు ఉంటాయని శక్తి నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఇందులో కర్ణాటకతోపాటు తెలంగాణ రైతులకు చెందిన మోటర్లు కూడా ఉన్నాయి. ఈ దర్యాప్తులో తేలంగాణ సరిహద్దు కృష్ణా పోలీసుల సహకారంతో కరెంటు మోటార్ల భారీ దొంగతనం బయటపడింది. విచార‌ణ పూర్తి చేసి త్వరలో కోర్టు ముందు హాజరు పరుస్తామని శక్తినగ‌ర్ ఎస్ఐ ప్రకాష్ రెడ్డి తెలిపారు. మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ నది పరివాహక ప్రాంతంలో మోటార్లు చోరీ గురైన‌ రైతులందరూ కృష్ణా పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

Next Story