- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువకుడు అదృశ్యం
మండల పరిధిలోని ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన కొల్లూరు గ్రామ పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, నవాబుపేట : మండల పరిధిలోని ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన కొల్లూరు గ్రామ పరిధిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జక్కని అంజయ్య(33) ఈనెల 08న ఇంట్లో నుంచి బయటికి వెళ్లాడు. అప్పటి నుంచి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. అంజయ్య కు తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. ఆయనకు 8 మంది సోదరీమణులకు వివాహాలు జరిగాయి. వారంతా తమ అత్తగారింటివద్ద ఉండటంతో ఒంటరిగా కొల్లూరు గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఈనెల 8న అదృశ్యమైన అంజయ్య ఆచూకీ కోసం ఆయన సోదరీమణులు తమ బంధుమిత్రుల దగ్గర వెతికినా అతని ఆచూకీ లభించలేదు. తన ఆరో సోదరి మండల పరిధిలోని దేపల్లి గ్రామానికి చెందిన రాపోలు చంద్రకళ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ సోదరుడికి దాయాదులకు భూమి విషయంలో తగాదాలు ఉన్నాయని.. అందువల్లనే అతను అదృ|శ్యమయ్యాడేమోనని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీస్ ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిపారు.






