- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళా సమాఖ్య బిల్డింగ్ త్వరగా పూర్తి చేయాలి
మండల పరిధిలోని మహిళా సమాఖ్య బిల్డింగ్ త్వరగా పూర్తి చేయాలని మహమ్మదాబాద్ సర్పంచ్ జే.రాంలాల్ పేర్కొన్నారు.

X
దిశ, మహమ్మదాబాద్ : మండల పరిధిలోని మహిళా సమాఖ్య బిల్డింగ్ త్వరగా పూర్తి చేయాలని మహమ్మదాబాద్ సర్పంచ్ జే.రాంలాల్ పేర్కొన్నారు. ఇవాళ ఆయన మహిళా సమాఖ్య బిల్డింగ్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి మహిళా సమాఖ్య బిల్డింగ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ముందుకు సాగేందుకు ఈ భవనం కేంద్ర బిందువుగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పవన్ కుమార్, ఏఈ ముతిన్, ఏపీఎం నిర్మల, వార్డ్ మెంబర్లు మల్లేష్, శీను, కేశవులు, మాజీ ఉపసర్పంచ్ అశోక్, చాపల సంఘం అధ్యక్షుడు నర్సింలుతో పాటు గ్రామ పెద్దలు, మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.
Next Story






