- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రగాడి మాయలో పడి భర్తను హతమార్చిన భార్య
దిశ, నాగర్ కర్నూల్ : పరాయి వ్యక్తి మోజులో పడి.. కట్టుకున్న భర్తను తన ప్రియుడుతో కలిసి ఓ భార్య హతమార్చింది. ఈ సంఘటనకు సంబంధించి డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ యాదవ్

దిశ, నాగర్ కర్నూల్ : పరాయి వ్యక్తి మోజులో పడి.. కట్టుకున్న భర్తను తన ప్రియుడుతో కలిసి ఓ భార్య హతమార్చింది. ఈ సంఘటనకు సంబంధించి డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ యాదవ్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. నాగర్ కర్నూల్ మండలం శ్రీపురం గ్రామానికి చెందిన మైనగాని రాములు కు పెద్ద కొత్తపల్లి మండలం వెన్న చర్ల కు చెందిన మానసతో 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. గత ఐదు నెలల క్రితం ఇంట్లో బంగారం పోయింది అని .. పోయిన బంగారం ఎవరు దొంగిలించారు అన్న విషయాన్ని పెద్ద ముద్దనూరు గ్రామానికి చెందిన మంత్రగాడు సురేష్ గౌడ్ చెబుతాడని మానస తన భర్త రాములును తీసుకొని వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే మానస-సురేష్ గౌడ్ మధ్య ఏర్పడ్డ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం భర్తకు తెలియడంతో అతను తన భార్యను మందలించాడు. తీరు మార్చుకోవాలి అని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన ఫలితం లేక పోయింది.
తన భర్త రాములు ఉంటే తమ వివాహేతర సంబంధం కొనసాగడం కష్టం అని భావించి.. తన ప్రియుడు సురేష్ గౌడ్ తో కలిసి ప్లాన్ వేసింది. ఈనెల 8న నాగర్ కర్నూల్ మండలం గుడిపల్లి లో జరిగే ఓ వివాహానికి నా భర్త రాములతో పాటు కుటుంబ సభ్యులందరం వెళ్తున్నామని సమాచారం ఇచ్చింది. దీనితో సురేష్ గౌడ్ పెద్ద కొత్తపల్లి మండలం వెన్న చర్ల కు చెందిన బాల పేరు, అతని బావమరిది హనుమంతుకు రాములును హత్య చేసేందుకు సహకరించాలని కోరాడు. అందుకు ఒక్కొక్కరికి 2,80,000 ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. పెళ్లి వేడుకలలోనే ఉన్న రాములును బాల పేరు, హనుమంతు దావత్ ఇస్తామని చెప్పి సురేష్ గౌడ్ వ్యవసాయ పొలం వద్దకు తీసుకువెళ్లారు. మద్యం ఎక్కువగా తాగించి మతిస్థిమితం కోల్పోయేలా చేశారు. అనంతరం ఒక కారులో నలుగురు గుడిపల్లి కి చేరుకున్నారు. అక్కడ మరింత మద్యం సేవించి.. వెంట తెచ్చుకున్న ప్లాస్టర్ తో రాములు కు ఊపిరి ఆడకుండా ముఖానికి చుట్టారు. ప్రాణాలు కోల్పోయిన అనంతరం మోటార్ బైక్ ప్రమాదం లో మరణించినట్లుగా నమ్మించేందుకు.. రాములు ముఖంపై గాయాలు చేశారు. సమాచారం తెలియడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుని తండ్రి పాండయ్య తన కుమారుడి మృతి పై అనుమానాలు ఉన్నాయి అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో నిందితులు రాములును అతని భార్య సహకారంతో హత్య చేశామని నేరాన్ని అంగీకరించారు. ఈ మేరకు హత్యకు ప్రోత్సహించిన మానస, హత్య చేసిన సురేష్ గౌడ్, హనుమంతు, బాల బీరు పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.






