పెళ్లి వేడుక‌.. మ‌తి స్థిమితం లేని వ్య‌క్తిని కుటుంబ చెంత‌కు చేర్చింది

by Ratna Kumari |

దిశ, చిన్నంబావి : చిన్నంబావి మండల కేంద్రం లోని వాల్మీకి చౌరస్తా లో గత కొద్ది సంవత్సరాలుగా తిరుగుతూ కనిపిస్తున్న మతి స్థిమితం లేని వ్యక్తి శంకరయ్య ను కుటుంబ సభ్యులు గుర్తించి

పెళ్లి వేడుక‌.. మ‌తి స్థిమితం లేని వ్య‌క్తిని కుటుంబ చెంత‌కు చేర్చింది
X

దిశ, చిన్నంబావి : చిన్నంబావి మండల కేంద్రం లోని వాల్మీకి చౌరస్తా లో గత కొద్ది సంవత్సరాలుగా తిరుగుతూ కనిపిస్తున్న మతి స్థిమితం లేని వ్యక్తి శంకరయ్య ను కుటుంబ సభ్యులు గుర్తించి వెంట తీసుకెళ్లారు. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. శంకరయ్య గత ఐదు సంవత్సరాలుగా చిన్నంబావి మండలం లోని వివిధ గ్రామాల్లో తిరుగుతూ జీవనం సాగిస్తున్నాడు. గ్రామస్తులు కుల, మతాల తేడాలు లేకుండా తమ ఇళ్ల వద్దకు వచ్చినప్పుడు శంకరయ్యను ఆదరిస్తూ భోజనం పెడుతూ మానవత్వాన్ని చూపారు. పెద్దమార్ గ్రామంలో ఒక వివాహానికి ఫోటో గ్రాఫర్‌ గా వచ్చిన రవితేజ, అటుగా వెళ్తూ శంకరయ్య ను చూసి ఇతను మా బాబాయ్‌ అని గుర్తించాడు. వెంటనే ఆయన ఈ సమాచారాన్ని శంకరయ్య, కుటుంబ సభ్యులకు చేర వేశారు. సమాచారం అందుకున్న శంకరయ్య, కుమారులు దేశపాగ రఘు, రవితేజ లు శంషాబాద్ మండలం లోని పెద్ద గోల్కొండ గ్రామం నుంచి పెద్దమార్ గ్రామానికి చేరుకుని మూడు గంటల సమయంలో గ్రామానికి వచ్చిన కుటుంబ సభ్యులు గ్రామస్తుల సమక్షం లో శంకరయ్య ను చూసి ఆనందం వ్యక్తం చేశారు. శంకరయ్య, కుటుంబ సభ్యులు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా అనేక పోలీస్ స్టేషన్ల లో ఫిర్యాదులు చేసినప్పటికీ శంకరయ్యను గుర్తించ లేకపోయామని వారు తెలిపారు. శంకరయ్య, ను దేవుడిలా చూసుకుంటూ, అన్నం పెట్టి ఆదరించిన చిన్నంబావి మండల ప్రజలకు, పెద్ద మార్ గ్రామ ప్రజలకు, కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం శంకరయ్య, ను వారి తో పాటు వారి స్వగ్రామానికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో పెద్దమార్ గ్రామస్తులు మాజీ ఉప సర్పంచ్ బిసన్న, పసుల పెద్ద రంగస్వామి, మద్దిలేటి, నరహరి, కొప్పునూర్ గ్రామానికి చెందిన నటరాజ్, రాముడు, కురుమయ్య, రాము, రమేష్ పాల్గొన్నారు.

Next Story