- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామస్తుల కల సాకారమైంది.. రూ. 6 కోట్ల 14 లక్షల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం
నూతన రహర్దారుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తిరుపతి రెడ్డి అన్నారు.

దిశ, కోస్గి: కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలతో పాటు అన్ని ప్రధాన గ్రామాలకు ప్రయాణించేందుకు అణువుగా రహదారుల విస్తరణ, నూతన రహర్దారుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తిరుపతి రెడ్డి అన్నారు. మంగళవారం కోసిగి మండలం కడంపల్లి హనుమన్ పల్లి గ్రామాల మధ్య వాగు ప్రవహిస్తుండడంతో దశాబ్దాలుగా వర్షాకాలంలో ఈ గ్రామ ప్రజలకు రాకపోకలకు అంతరాయం కలిగేది. బ్రిడ్జి నిర్మాణం లేకపోవడం, భారీ వర్షాలతో ఈ వాగులు దాటాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నరకయాతన పడుతున్న ఈ గ్రామ ప్రజల దశాబ్దాల కల ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి చొరవతో రూ.6 కోట్ల 14 లక్షల వ్యయంతో ఈ వాగుపై బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా ఉండేందుకు ముందు భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని రహదారుల నిర్మాణం అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళిక బద్ధంగా అమలు చేస్తున్నామని తిరుపతి రెడ్డి అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ వార్ల విజయకుమార్, కాడ చైర్మన్ వెంకట్ రెడ్డి, హనుమాన్ పల్లి గ్రామ సర్పంచ్ రాము, కోస్గి మున్సిపల్ చైర్పర్సన్ నాగులపల్లి నరేందర్, ఈఈ అశోక్, డి ఈ అంజిరెడ్డి, ఏఈ మారుతి, కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు.






