- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గద్వాల మున్సిపాలిటీలో భార్యాభర్తల గెలుపు జోరు
జోగుళాంబ గద్వాల జిల్లా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు కౌన్సిలర్లుగా ఎన్నికై రికార్డు సృష్టించారు.

X
దిశ, గద్వాల : జోగుళాంబ గద్వాల జిల్లా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు కౌన్సిలర్లుగా ఎన్నికై రికార్డు సృష్టించారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు రామాంజనేయులు , ఆయన సతీమణి, మున్సిపల్ మాజీ చైర్మన్ కృష్ణవేణి ఇద్దరూ బీజేపీ తరపున పోటీ చేసి ఘన విజయం సాధించారు. రామాంజనేయులు 19వ వార్డు నుంచి విజయం సాధించగా.. కృష్ణవేణి 26వ వార్డు నుంచి గెలుపొందారు. గతంలో మున్సిపల్ చైర్మన్‌గా పని చేసిన అనుభవం ఉన్న కృష్ణవేణి, జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రామాంజనేయులు ఇద్దరూ ఒకేసారి కౌన్సిల్‌లో అడుగుపెడుతుండటంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. వీరిద్దరి విజయం జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Next Story






