- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాధితురాలకు న్యాయం చేసిన ట్రాఫిక్ పోలీసులు
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఓ మహిళ ఆటోలో మరిచిపోయిన విలువైన ఆభరణాలను శుక్రవారం సీసీటీవీ ఆధారాలతో ట్రాఫిక్ పోలీసులు గుర్తించి ఆ సొమ్మును తిరిగి ఆ మహిళకు

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఓ మహిళ ఆటోలో మరిచిపోయిన విలువైన ఆభరణాలను శుక్రవారం సీసీటీవీ ఆధారాలతో ట్రాఫిక్ పోలీసులు గుర్తించి ఆ సొమ్మును తిరిగి ఆ మహిళకు ఇప్పించి అందరి అభినందనలు అందుకున్నారు. వివరాలలోకి వెళితే శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కోర్టు సమీపములో మణికొండ గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళ ఆటో ఎక్కి, క్లాక్ టవర్ వద్ద తన బ్యాగును మరిచిపోయి దిగింది. ఈ విషయాన్ని కొంత ఆలస్యంగా గుర్తించి ఆటో ఆచూకీ కోసం ప్రయత్నించగా అప్పటికే ఆ ఆటో కనిపించకుండగా పోయింది. ఆ మహిళ వెంటనే మహబూబ్ నగర్ ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించి వివరాలు తెలియజేసింది. వెంటనే ట్రాఫిక్ సీఐ భగవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఆ మహిళ ఎక్కిన ఆటో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నెంబర్ 536 (ఆటో నెంబర్: ఏపీ 22 టిఏ 7262) నంబరుగా గుర్తించారు. వెంటనే ఆ ఆటో డ్రైవర్ కు ఫోన్ చేసి స్టేషన్ కు పిలిపించారు. ఆ డ్రైవర్ వద్ద ఉన్న బ్యాగును ఎస్సై బాల్య నాయక్ మహిళకు ఇప్పించారు.సి సి కెమెరాలను సద్వినియోగపరచుకొని పోయిన సొమ్మును వెంటనే బాధితులకు అందజేయడంలో ప్రధాన పాత్ర పోషించిన సిబ్బందిని ఎస్పీ జానకి ప్రత్యేకంగా అభినందించారు.






