- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏకంగా ఏటిఎం నే ఎత్తుకెళ్లిన దుండగులు
సోమవారం అర్థరాత్రి దాటాక మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నడిబొడ్డు లోని తెలంగాణ చౌరస్తా సమీపంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఏటీఎం సెంటర్ ను ధ్వంసం చేసి ఏకంగా ఏటిఎం మీషన్ నే ఎత్తుకెళ్లిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : సోమవారం అర్థరాత్రి దాటాక మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నడిబొడ్డు లోని తెలంగాణ చౌరస్తా సమీపంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఏటీఎం సెంటర్ ను ధ్వంసం చేసి ఏకంగా ఏటిఎం మీషన్ నే ఎత్తుకెళ్లిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దుండగులు ముందుగానే సీసీ కెమెరాలను, సీసీ కెమెరా డివీఆర్ బాక్సును, సర్వర్ ను ధ్వంసం చేశారు. ఎత్తుకెళ్లిన ఏటిఎం మీషన్ ను పట్టణ పరిధిలోని బోయపల్లి గ్రామ శివారులో పగలగొట్టి అందులోని నగదు దోచుకెళ్లారు. విషయం తెలిసిన టూ టౌన్ పోలీస్ సీఐ ఇజాజోద్దీన్ సంఘటనా స్థలానికి చేరుకుని ధ్వంసం అయిన ఏటిఎం మీషన్ ను స్వాధీనపరుచుకున్నారు. ఏటిఎం లో వినియోగదారులు విత్ డ్రా చేసుకున్న తర్వాత 2,35,700 రూపాయల నగదు ఉన్నట్లు బ్యాంకు అధికారి గోపాల్ రెడ్డి తెలిపారు. అర్ధరాత్రి పట్టణ నడిబొడ్డున దుండగులు నెంబర్ లేని 'బోలెరా క్యాంపర్' వాహనంలో ఏటిఎం ను తీసుకువెళ్ళడం విస్మయానికి గురి చేసింది. ఇట్టి దోపిడి వెనుక ఆరితేరిన హర్యానాకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా హస్తం ఉండోచ్చని, త్వరలో దుండగులను పట్టుకుంటామని డిఎస్పీ వెంకటేశ్వర్లు విశ్వాసం వ్యక్తం చేశారు. ఏదిఏమైనా ఇకపై రాత్రుళ్ళు గట్టి నిఘా ఏర్పాటు చేసి దొంగతనాలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.






