ఔట్ సోర్సింగ్ వ్య‌వ‌స్థ ర‌ద్దు చేయాలి

by Nallavelli.Anjaneyulu |

దిశ, కందనూల్ : ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జెడ్‌పీ హెచ్‌ఎస్

ఔట్ సోర్సింగ్ వ్య‌వ‌స్థ ర‌ద్దు చేయాలి
X

దిశ, కందనూల్ : ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జెడ్‌పీ హెచ్‌ఎస్ గ్రౌండ్లో బుధవారం నిర్వహించిన ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ చారి మాట్లాడుతూ ఔట్సోర్సింగ్ విధానం వల్ల ఉద్యోగులు అనిశ్చితిలో ఉన్నారన్నారు. ప్రభుత్వం ఈ వ్యవస్థను రద్దు చేసి శాశ్వత నియామకాలు చేయాలన్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోరుతూ ఈ నెల 9న మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించనున్న ఆత్మీయ సభను విజయవంతం చేయాలని ఉద్యోగులను పిలుపునిచ్చారు. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, కోదండరామిరెడ్డిలు ఈ సభకు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు.

Next Story