- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిస్టరీగా మారిన ఆత్మహత్యలు.. సంచలన విషయాలు బయట పెట్టిన గ్రామస్తులు
మండల పరిధిలోని ముకురాల గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన భార్య భర్తలు, ఇద్దరు పిల్లలు హైదరాబాద్ లోని హబ్సిగూడలో బలవన్మరణం చెందారు.

దిశ, కల్వకుర్తి: మండల పరిధిలోని ముకురాల గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన భార్య భర్తలు, ఇద్దరు పిల్లలు హైదరాబాద్ లోని హబ్సిగూడలో బలవన్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే... ముకురాల గ్రామానికి చెందిన కొత్త చంద్ర శేఖర్ రెడ్డి (45) 25 యేండ్ల క్రితం హైదరాబాద్ లో ట్యూషన్ చెప్తూ పలు విద్యాసంస్థల్లో లెక్చరర్ గా బోధన చేస్తూ.. భార్య కవిత (36), కూతురు శ్రీత రెడ్డి(14), విశ్వా రెడ్డి (9) లతో హబ్సిగూడలో నివాసం ఉంటున్నాడు. సాఫీగా సాగిపోతున్న వీరి జీవితాలకు ఏ అడ్డంకు ఏర్పడిందో ఏమో ఈ నెల 10వ తేది మధ్యాహ్నం హబ్సి గూడలో అద్దెకు ఉంటున్న ఇంట్లో తన ఇద్దరి పిల్లలకు విషమిచ్చి, భార్య, భర్త గదిలో ఉన్న ప్యాన్స్ కి ఉరివేసుకొని తనువు చాలించారు. అప్పుల బాధతో బలవన్మరణం చేసుకున్నారని వదంతులు బయట దావానంలా వ్యాపించాయి.
చంద్ర శేఖర్ తోడ నలుగురు అన్నదమ్ములు. ముకురాల గ్రామంలో దాదాపు 80 ఎకరాల భూమి వీరిపై ఉంది. మృతుడు చంద్ర శేఖర్ రెడ్డి పేర తన స్వంత ఊరిలో దాదాపు 15 ఎకరాల భూమి ఉన్నట్టు సమాచారం. అలాగే మృతుడు భార్య కవిత స్వస్థలం తాడూర్ మండలం పుల్జాల గ్రామం. తల్లిగారి కుటుంబం కూడ ఉన్నతంగా బాగా ఆస్తులు ఉన్నవారే. ఇరువైపులా ఇన్ని అవకాశాలున్నా మృతులు భవిష్యత్ ఉన్న పిల్లలకు విషమిచ్చి, వారు ఉరివేసుకొని ఎందుకు బలవన్మరణానికి ఎందుకు పాల్పడ్డారనేది సందేహానికి గురిచేస్తుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అప్పులు ఉన్నాయని ఏనాడూ మాకు సమాచారం ఇవ్వలేదంటూ కుటుంబీకుల సమాచారం.
ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో..వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారని, సంభందిత పోలిస్ స్టేషన్ లో మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.






