తండ్రిని కంప చెట్ల‌లో నెట్టేసిన కొడుకు

by Ratna Kumari |

దిశ, జడ్చర్ల : రోజు రోజుకు మానవత్వం మంటగలుస్తోంది. ముఖ్యంగా ఈరోజుల్లో మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి.

తండ్రిని కంప చెట్ల‌లో నెట్టేసిన కొడుకు
X

దిశ, జడ్చర్ల : రోజు రోజుకు మానవత్వం మంటగలుస్తోంది. ముఖ్యంగా ఈరోజుల్లో మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి. కన్న తల్లిదండ్రులను ఆస్తుల కోసం, అనారోగ్యంతో బాధపడుతున్న, వృద్ధులైన, తల్లిదండ్రులను ఇంట్లో నుంచి గెంటివేస్తున్న ఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం. అలాంటి ఘటననే జడ్చర్ల మున్సిపాలిటీలో మంగళవారం చోటుచేసుకుంది. కుమారుడు తన మొఖం కనిపించకుండా గుడ్డలు కట్టుకొని బైక్ పై బతికున్న తన వృద్ధ‌ తండ్రిని తీసుకువచ్చి జడ్చర్ల మున్సిపాలిటీలోని 100 పడకల ఆసుపత్రి వద్ద కంప పొదల్లోని గుంతలో నెట్టేసి వెళ్లిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోయిలకొండ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన వడ్డే బాలయ్య అనే వృద్ధుడిని తన కన్న కుమారుడే తీసుకువచ్చి ఆసుపత్రి సమీపంలో ఉన్న మురికి కంప పొదల్లో విసిరేసి వెళ్ళాడు. దీంతో ఆల్రెడీ నేను వృద్ధుడు అచేతనంగా గుంతలోని కంప పొదల్లో రచయితనంగా పడి ఉన్నాడు. ఈ క్రమంలోనే అటుగా వెళుతున్న కొందరి కంట వృద్ధుడు పడడంతో వెళ్లి చూడగా వృద్ధుడు మూలుగుతూ ఉండడానికి గమనించి వారు కంప పొదల నుంచి వృద్ధుడిని బయటికి తీసుకువచ్చి వివరాలు అడగగా చెప్పడం లేదు. దీంతో సానికులు బుద్ధుడికి చేరదీసి ఆస్పత్రిలో చేర్పించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై వృద్ధుడిని పడేసి వెళ్లిన కుమారుడి ఆచూకీ వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. ప్రస్తుతం వృద్ధుడు జడ్చర్ల వంద పడకల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Next Story