- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాబాయి చెవి కొరికిన కొడుకు
నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట గ్రామంలో శనివారం రాత్రి జరిగిన ఘర్షణలో ఒకరు గాయపడ్డారు.

X
దిశ, లింగాల : నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట గ్రామంలో శనివారం రాత్రి జరిగిన ఘర్షణలో ఒకరు గాయపడ్డారు. బాధితుడు అంకూరి శివ తెలిపిన వివరాల ప్రకారం.. తన కుమార్తెను చెంపదెబ్బ కొట్టిన విషయంపై ప్రశ్నించగా, గ్రామానికి చెందిన లాజర్, పరమేశ్, అలివేలు కలిసి అతనిపై కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేసి తలకు, భుజానికి గాయపరిచారు. తరువాత రాత్రి సమయంలో మరోసారి వివాదం చోటుచేసుకోగా, నిందితుడు వెంకటయ్య బాధితుడి బాబాయి యల్లయ్య చెవిని కొరకగా చెవి కొంత భాగం ఉడిపోయింది. తీవ్ర గాయాల కారణంగా బాధితులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తునట్లు లింగాల ఎస్ఐ ఏ. వెంకటేశ్వర గౌడ్ తెలిపారు.
Next Story






